ఒకప్పుడు మద్యం కారణంగా వాళ్ల గ్రామంలో చాలా మంది కుటుంబాలు వీధిన పడ్డాయంట. తినడానికి తిండి లేక.. ఆస్తులు పోగొట్టుకొని ఇబ్బందుల పాలైనవాళ్లు చాలా మంది ఉన్నారు. విపరీతంగా తాగేసి వచ్చి భార్య, బిడ్డలను కొట్టడం.. వారిని పట్టించుకోకపోవడం చేసేవారట. దీంతో.. ఇలా అయితే కష్టం అని.. మద్యపాన నిషేధం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 26 ఏళ్లుగా ఇదే నిర్ణయాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన వాళ్లు.. మద్యానికి దూరంగా ఉండటమే కాదు.. వేరే ఊరి వాళ్లు కూడా తమ గ్రామంలో ఆల్కహాల్ జోలికి వెళ్లనివ్వరు. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూల్ డ్రింక్స్ ఇస్తారు తప్ప.. ఆల్కహాల్ మాట మాత్రం ఎత్తరు.
ఎవరైనా మద్యం తాగితే కఠిన శిక్షలు...
ఈ గ్రామ నిబంధనల ప్రకారం ఎవరైనా మద్యం సేవించినట్లు తెలిస్తే.. వెంటనే వారికి జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు గ్రామ సభ ముందు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని ఆ గ్రామ పెద్దలు చెబుతున్నారు. అయితే.. ఈ నియమం పెట్టుకున్న తర్వాత ఎవరూ ఈ రూల్ ని అతిక్రమించకపోవడం గమనార్హం.
ఈ గ్రామాన్ని చూసి.. చుట్టు పక్కన గ్రామాలు కూడా ఈ నియమం పాటించాలని అనుకుంటున్నాయంట. చాలా మంది మందు మానేసిన వారు కూడా ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం కారణంగా.. అక్కడ చాలా మంది కుటుంబాలు దారిన పడ్డాయి. కుటుంబంలో గొడవలు తగ్గాయి. ఆదాయం కూడా క్రమంగా పెరిగింది. మద్యం కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత కాలంలో.. ఈ గ్రామం ఇతర ప్రాంతానికి ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామస్థుల ఐక్యత, సామాజిక బాధ్యత ఉంటే ఎలాంటి సమస్యలను అయినా సులభంగా అధిగమించవచ్చని ఈ గ్రామం నిరూపిస్తోంది.