కోపం, భయం వంటి భావోద్వానికి గురైన వెంటనే శరీరంలో అడ్రెనలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది హృదయ స్పందన రేటును పెంచి, రక్తనాళాలను విస్తరింపజేస్తుంది. అడ్రెలిన్ ఎక్కువగా విడుదలైతే శరీరంలో ఒక్కసారిగా రక్తప్రరణ వేగం పెరుగుతుంది. దీంతో ముఖం, చెంపలు, చెవులు ఎర్రబడతాయి. కోపానికి గురైన వారిలో ముఖంపై ఉండే కాపిల్లరి అనే చిన్న రక్తనాళంలో రక్తం ఎక్కువగా ప్రవహిస్తుంది.
కోపం వచ్చిన సమయంలో రక్తనాళాలు విస్తరించడం వల్ల ముఖం ఎర్రబడుతుంది. ఇది శరీరం తాత్కాలికంగా అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కోవడానికి చేసే చర్య. కోపంలో సింబథెటిక్ నర్వస్ సిస్టమ్ (Sympathetic Nervous System) యాక్టివ్ అవుతుంది. ఇది కూడా ముఖం ఎర్రబడడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. కోపం తగ్గిన వెంటనే మళ్లీ చర్మం రంగు మాములు స్థితికి వచ్చేస్తుంది. అడ్రెనలిన్ స్థాయిలు తగ్గగానే ఎర్రదనం తగ్గుతుంది.