భారత బిలీనియర్లు ముకేష్ అంబానీ, నీతా అంబానీల గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రిలయన్స్ అధినేత, భారత కుబేరుడిగా ముకేష్ అంబానీ అందరికీ సుపరిచితమే. ఈ జంటను పవర్ ఫుల్ కపుల్ గా పిలుస్తారు. కొంతకాలంగా ముఖ్యంగా అంబానీ పేరు ఎక్కువగా వినపడుతోంది. అందుకు కారణం... ఆయన కుమారుడి వివాహమే. ముకేష్-నీతా ల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం త్వరలోనే జరగనుంది. వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.