తలనొప్పి
తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మిల్ మేకర్ ను ఎక్కువగా తింటే కూడా కొంతమందికి తలనొప్పి వస్తుంది. ఇలాంటి తలనొప్పి కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉంటుంది. అందుకే మిల్ మేకర్ ను ఎక్కువగా తినకూడదు.
మూత్రపిండాల్లో రాళ్లు
మిల్ మేకర్ ను ఎక్కువగా తినడం మూత్రపిండాలకు కూడా మంచిది కాదు. మిల్ మేకర్ లో ఆక్సలేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది మన శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే.. మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
క్రమరహిత రుతుస్రావం
చాలా మంది ఆడవారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతుంటారు. నిపుణుల ప్రకారం.. మిల్ మేకర్ ను ఎక్కువగా తినే ఆడవారికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
డయేరియా
మిల్ మేకర్లు సోయాతో తయారవుతాయి. అయితే వీటిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది కొంతమందిలో విరేచనాలకు కారణమవుతుంది. అందుకే వీటిని ఎక్కువ మొత్తంలో తినకూడదు.
పురుషుల్లో రొమ్ము పరిమాణం పెరుగుతుంది
సోయా బీన్ పురుషులపై కూడా ప్రభావం చూపుతుంది. మిల్ మేకర్ ను ఎక్కువ మొత్తంలో తినే పురుషులు లేదా ఏదైనా సోయా ఆధారిత ఆహారాలు ఈస్ట్రోజెన్ హార్మోన్ ను పెంచుతాయి. ఇది పురుషుల వక్షోజాలను పెంచుతాయి.
అలెర్జీ
అలెర్జీ కూడా ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అయితే కొంతమందికి ఫ్లేవోన్స్ అనే ప్రోటీన్ కు అలెర్జీ ఉంటుంది. ఇవి సోయాలో చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తాయి.