ఇండియాలో ఈ 10 రోగాలు చాలా కామన్..

First Published Nov 25, 2022, 10:52 AM IST

ఒకప్పుడు గుండెపోటు అంటే నూటిలో ఒకరికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు వయసు, లింగం అంటూ తేడా లేకుండా అందరికీ వస్తోంది. అసలు మన దేశంలో అత్యంత సాధారణ 10 రోగాలేంటో తెలుసా? 
 

క్యాన్సర్..

క్యాన్సర్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కారణం ఇది మనిషి ప్రాణాలను తేలిగ్గా తీస్తుందని. క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. దీనిలో శరీరంలోని కొన్ని కణాలు అదుపు లేకుండా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. కానీ ఈ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. రోగం మొత్తం ముదిరి.. కొన్ని రోజుల్లో చనిపోతామన్న సమయంలోనే దీని లక్షణాలు కనిపిస్తాయి. 
 

కార్డియోవాస్కులర్ వ్యాధి

కార్డియోవాస్కులర్ వ్యాధి గుండె, రక్త నాళాలను ప్రభావితం చేస్తుంది. దీనిలో కరోనరీ హార్ట్ డిసీజ్, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, రుమాటిక్ హార్ట్ డిసీజ్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ ఎంబోలిజం వంటి సమస్యలు ఉన్నాయి. మన దేశంలో చిన్న వయసు వారు కూడా ఈ రోగాల బారిన పడుతున్నారు.
 

స్ట్రోక్

మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా కానప్పుడు లేదా మెదడులోని రక్తనాళం పగిలినప్పుడు స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ తో కూడా  చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 
 

diabetes

మధుమేహం

మన దేశంలో మధుమేహుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం అనేది క్లోమం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించలేనప్పుడు సంభవించే దీర్ఘకాలిక పరిస్థితి.
 

క్షయవ్యాధి (TB)

ఇండియాలో టీబి పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. క్షయవ్యాధి (TB) అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. అయితే TB బ్యాక్టీరియా శరీరంలోని ఏ భాగంపై అయినా దాడి చేస్తుంది.

covid 19

COVID-19

COVID-19 అనేది SARs-CoV-2 వైరస్ వల్ల సంక్రమించే ఒక అంటు వ్యాధి. దీని లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రమైనవిగా ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను పోలి ఉంటాయి. దీనిబారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

dengue

వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు

డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు భారతదేశంలో సాధారణ వ్యాధులు. ఈ వ్యాధుల వల్ల విపరీతమైన జ్వరం, శరీర నొప్పులు, దద్దుర్లు, మరెన్నో మనిషిని  బలహీనపరిచే లక్షణాలు కనిపిస్తాయి. 
 

chronic obstructive pulmonary disease symptoms

ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి

క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) అనేది ఊపిరితిత్తుల నుంచి వాయు ప్రసరణకు ఆటంకం కలిగించే దీర్ఘకాలిక శోథ ఊపిరితిత్తుల వ్యాధి. ఇది కూడా మన దేశంలో సాధారణ వ్యాధి.
 

లివర్ సిర్రోసిస్

లివర్ సిర్రోసిస్ ఒక ప్రాణాంతక వ్యాధి. దీనిలో లివర్ సెల్స్ దెబ్బతింటాయి. దీంతో కాలెయం పనితీరు తగ్గుతుంది. సిర్రోసిస్ అనేది దీర్ఘకాలికంగా కాలేయం దెబ్బతినడమని అర్థం. ఇది ప్రాణాంతకంగా మారుతుంది. దీనిని ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ అని కూడా అంటారు.

అతిసార వ్యాధులు

అతిసార వ్యాధుల వల్ల విరేచనాలు దారుణంగా అవుతాయి. వీటిని నీటి విరేచనాలు అని కూడా అంటారు. ఇది వైరస్ లేదా కొన్నిసార్లు కలుషితమైన ఆహారం లేదా నీటిని తాగడం వల్ల వస్తుంది. 

click me!