Toilet Paper: ఫ్రిజ్‌లో టాయిలెట్ పేపర్ పెట్టడం ఎంత మంచిదో తెలుసా?

Published : Oct 09, 2026, 04:23 PM IST

Toilet Paper: టాయిలెట్ పేపర్‌ కేవలం బాత్రూమ్ లోనే వాడాలని లేదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడవచ్చు. దీన్ని ఫ్రిజ్‌లో పెడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీని వల్ల లాభం ఏంటో ఇప్పుడు చూద్దాం.

PREV
13
ఫ్రిజ్ లో టాయిలెట్ పేపర్ రోల్

ఫ్రిజ్ లో అనేక రకాల వస్తువులు మనం పెడతాం. కూరగాయల నుంచి మిగిలిన కూరల వరకు అన్ని ఫ్రిజ్ లోనే ఉంటాయి. మనం రోజూ ఫ్రిజ్ డోర్ తీసినప్పుడు కూరగాయలు, పాలు, మిగిలిపోయిన ఆహారం వాసనలు కలిసిపోయి ఒక రకమైన చెడు వాసన వస్తుంది. అంతేకాదు, కూరగాయల కవర్ల మీద తేమ చేరి అవి త్వరగా పాడైపోతాయి. ఈ సమస్యకు చవకైన పరిష్కారం 'టాయిలెట్ పేపర్ రోల్' . ఫ్రిజ్ లో టాయిలెట్ పేపేర్ రోల్ ఒకటి పెడితే చాలు. ఆ సమస్య పూర్తిగా పోతుంది.

23
ఇది ఎలా పనిచేస్తుందంటే?

టాయిలెట్ పేపర్‌ను 'సెల్యులోజ్ ఫైబర్స్' (Cellulose fibers) తో తయారు చేస్తారు. ఈ చిన్న దారాలు గాలిలోని తేమను, వాసనను వెంటనే పీల్చుకుంటాయి. మనం ఫ్రిజ్ డోర్ తీసినప్పుడు బయట నుంచి వచ్చే వేడి గాలిని, లోపల ఆహారం నుంచి వచ్చే తేమను ఇది స్పాంజ్‌లా పీల్చుకుంటుంది. దీనివల్ల ఫ్రిజ్ లోపల వాతావరణం ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటుంది.

ప్లాస్టిక్ కవర్ నుంచి తీసిన, ఎలాంటి వాసన లేని (Unscented) కొత్త టాయిలెట్ పేపర్‌ను మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. బాత్‌రూమ్‌లో వాడే పేపర్‌ను పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకండి. అందులోని బ్యాక్టీరియా ఆహారానికి అంటుకునే ప్రమాదం ఉంది.

33
ఫ్రిజ్ లో ఎలా పెట్టాలి?

పేపర్ రోల్‌ను ఒక చిన్న ప్లేట్ లేదా మూత మీద పెట్టి, ఫ్రిజ్ వెనుక మూలలో (Corner) నిలబెట్టాలి. పచ్చి మాంసం లేదా కారుతున్న గిన్నెల పక్కన దీన్ని పెట్టకూడదు. ప్రతి 2 నుంచి 3 వారాలకు ఒకసారి ఈ రోల్‌ను మార్చాలి. పేపర్ బాగా తడిచిపోయినా లేదా వాసన వస్తున్నా వెంటనే తీసేసి కొత్తది పెట్టాలి.

ఇది గాలిలో ఉండే కొద్దిపాటి తేమను, వాసనను మాత్రమే పీల్చుకుంటుంది. అప్పటికే కుళ్ళిపోయిన ఆహారం నుంచి వచ్చే దుర్వాసనను ఇది పోగొట్టలేదు.

ఫ్రిజ్‌లో పాడైపోయిన ఆహారం ఉంటే ముందు దాన్ని బయటపడేసి ఫ్రిజ్ క్లీన్ చేయాలి.

విపరీతమైన దుర్వాసనను అరికట్టడానికి బేకింగ్ సోడా (Baking Soda) లేదా యాక్టివేటెడ్ చార్‌కోల్ (Activated Charcoal) కూడా మంచి ప్రత్యామ్నాయాలు.

Read more Photos on
click me!

Recommended Stories