Love Psychology: I Love You అనే మాట చాలా ప్రత్యేకమైంది. కానీ ప్రతి ఒక్కరూ తమ ప్రేమను మాటల్లో చెప్పలేరు. కొందరు చేతల్లో చూపిస్తుంటారు. I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా?
ప్రేమ అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు, మన ప్రవర్తన, చూపులు, చిన్న చిన్న కేర్‌లో కూడా కనిపించే భావన. అయితే చాలా మంది మనసులో ఉండే డౌట్ ఏంటంటే.. ఎప్పుడూ I Love You అని చెప్పే వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? లేదా చెప్పనివాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? అని. దీనిపై సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
26
మాటలతో కొలవడం కష్టం
సైకాలజీ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రేమను వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరికి I Love You అని పదే పదే చెప్పడం సహజంగా అనిపిస్తే, మరికొందరు అలా చెప్పడానికి కాస్త సంకోచిస్తారు. కానీ వారు మీ కోసం చేసే పనులు, మీ సమస్యలను పట్టించుకోవడం, మీకు అవసరమైనప్పుడు మీతో ఉండడం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. కాబట్టి ప్రేమను మాటలతోనే కొలవడం కష్టం.
36
పెరిగిన వాతావరణ ప్రభావం
కొందరు వ్యక్తులు చిన్నప్పటి నుంచి ఎమోషన్స్‌ను బయటపెట్టకుండా పెరిగి ఉంటారు. కుటుంబ వాతావరణం, పెంపకం, గత అనుభవాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడో ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుంచి ప్రేమను మాటల్లో వ్యక్తం చేయని కుటుంబంలో పెరిగిన వారు I Love You అని చెప్పడానికి ఇబ్బంది పడొచ్చు. అలాంటి వ్యక్తులు భావోద్వేగాల కంటే చర్యలను ఎక్కువగా నమ్ముతారు.
మరోవైపు, ఎప్పుడూ I Love You అని చెప్పే వాళ్లందరూ లోతుగా ప్రేమిస్తారనే గ్యారంటీ లేదు. కొన్ని సందర్భాల్లో అది అలవాటుగా మారిపోవచ్చు. నిజమైన ప్రేమ కేవలం మాటల్లో కాకుండా, కష్ట సమయంలో అండగా నిలబడటంలో, మీ భావాలను గౌరవించటంలో, మీ ఆనందాన్ని, మీకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను పట్టించుకోవటంలో కనిపిస్తుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది.
56
ప్రేమను వ్యక్తపరచడం
ప్రేమను వ్యక్తపరచకపోవడం ఎప్పుడూ మంచి విషయం అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి సంబంధంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కొందరికి ప్రేమను మాటల్లో వినడం వల్ల భద్రత, నమ్మకం కలుగుతుంది. సైకాలజీ ప్రకారం ఇద్దరు వ్యక్తులు తమ భావాలను ఒకరికొకరు అర్థమయ్యే విధంగా వ్యక్తపరుకోవడమే మంచిది.
66
బంధంలో ఇది ముఖ్యం
ప్రేమను అంచనా వేయాలంటే కేవలం I Love You అన్న మాటను మాత్రమే చూడకూడదు. ఆ వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? మీకు గౌరవం ఇస్తున్నాడా? మీ భావాలను అర్థం చేసుకుంటున్నాడా? మీ కోసం సమయం కేటాయిస్తున్నాడా? అనే విషయాలను కూడా గమనించాలి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక్క మాట కాదు, అది నిరంతరం కనిపించే శ్రద్ధ, ఆప్యాయత, బాధ్యతల కలయిక.