AC : ఎండలు మొదలయ్యాయని ఏసీ ఆన్ చేస్తున్నారా? ఇదొక్కటి చేస్తే పవర్ ఆదా చేయచ్చు

Published : Feb 19, 2026, 04:46 PM IST

AC : ఇంట్లో వేడిగా ఉంటుందని.. ఏసీ ఆన్ చేయడం మొదలుపెడుతున్నారా? చాలా గ్యాప్ తర్వాత ఏసీ ఆన్ చేయడానికి ముందు కొన్ని పనులు చేస్తే పవర్ ఆదా చేయడంతో పాటు.. మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. 

PREV
13
AC

మార్చి నెల రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా ఫ్యాన్ గాలి సరిపోవడం లేదు. ఇక బయటకు వెళ్లి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎండల నుండి ఉపశమనం పొందడానికి అందరూ వెంటనే ఏసీ వాడటం మొదలుపెడతారు. అయితే.. ఈ చలికాలం అన్నిరోజులు.. ఏసీ వాడకుండా ఉండి.. ఇప్పుడు ఎండలు మొదలవ్వగానే ఏసీని నేరుగా ఆన్ చేయడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పవర్ బిల్లు పెరగడమే కాకుండా, మీ ఆరోగ్యానికి కూడా ముప్పు కలగొచ్చు. కాబట్టి, ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు.. ఏసీ ఆన్ చేయడానికి ముందే కొన్ని పనులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...

23
1.ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేయడం...

ఇంతకాలం వాడకుండా ఉండటం వల్ల ఏసీలో ఉండే ఎయిర్ ఫిల్టర్లపై దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. అందుకే.. ఏసీ ఆన్ చేయడానికి ముందే దానిని శుభ్రం చేయించుకోవాలి. లేకపోతే.. దుమ్ము ఉన్న ఫిల్టర్ల వల్ల గాలి ప్రసరణ తగ్గి, ఏసీ రావడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా కరెంట్ బిల్లు పెరుగుతుంది.

అందుకే.. ఫిల్టర్లను తీసి గోరు వెచ్చని నీటితో కడిగి, పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ అందులో అమర్చితే సరిపోతుంది.

2.అవుట్ డోర్ యూనిట్ తనిఖీ చేయడం...

బయట ఉండే కంప్రెసర్ యూనిట్ చుట్టూ చెత్త, ఆకులు లేదా పక్షల గూళ్లు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఏసీ అవుటర్ యూనిట్ చుట్టూ కనీసం రెండు అడుగుల ఖాళీ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల వేడి గాలి సులభంగా బయటకు పోతుంది. ఏసీ వేసినప్పుడు గది తొందరగా చల్లపడుతుంది.

33
3. డ్రైన్ పైపును చూడండి

ఏసీ నుండి నీరు బయటకు వచ్చే పైపులో అడ్డంకులు ఉంటే, ఆ నీరు తిరిగి ఏసీ లోపలికే వచ్చి గోడలు పాడవుతాయి.

అందుకే... పైపులో పాచి లేదా దుమ్ము పేరుకుపోకుండా శుభ్రం చేయండి.

4. కాయిల్స్ శుభ్రత

ఇండోర్ , అవుట్‌డోర్ యూనిట్లలో ఉండే కాయిల్స్ శుభ్రంగా ఉంటేనే కూలింగ్ త్వరగా వస్తుంది. ఒకవేళ వాటిపై ఎక్కువ దుమ్ము ఉంటే, ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించడం ఉత్తమం.

5. గదిలో గాలి లీకేజీలను అరికట్టండి

ఏసీ ఆన్ చేసే ముందు కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూడండి.

చిట్కా: తలుపుల కింద ఉండే ఖాళీలను (Door gaps) అడ్డుకోవడం వల్ల చల్లని గాలి బయటకు పోకుండా ఉంటుంది, దీనివల్ల రూమ్ త్వరగా చల్లబడుతుంది.

6. స్టెబిలైజర్ తనిఖీ..

వేసవిలో వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. మీ ఏసీ స్టెబిలైజర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీ ఏసీ కంప్రెసర్ పాడవకుండా కాపాడుతుంది.

ఏసీని ఆన్ చేసిన వెంటనే 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. 16°C లేదా 18°C లో పెడితే కంప్రెసర్ మీద లోడ్ పెరిగి విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories