Men: పెళ్లి తర్వాత మగవారు ఎందుకు లావుగా మారుతారో తెలుసా.?

Published : Mar 18, 2025, 09:16 AM ISTUpdated : Mar 18, 2025, 04:55 PM IST

ప్రతీ మనిషి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని తెలిసిందే. అందుకే అటు మగవారితో పాటు ఇటు ఆడవారిలో కూడా పెళ్లిపై ఎన్నో అంచనాలు ఉంటాయి. తమకు నచ్చిన వారిని భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని అనుకుంటారు. అయితే పెళ్లి తర్వాత మనుషుల్లో మార్పు రావడం సర్వసాధారణం. అలాంటి ఒక మార్పు గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు..   

PREV
14
Men: పెళ్లి తర్వాత మగవారు ఎందుకు లావుగా మారుతారో తెలుసా.?
Couple

పెళ్లైన వారిని ఇట్టే గుర్తుపట్టొచ్చు. పెళ్లి జరిగిన కొత్తలో ముఖంలో ఏదో తెలియని గ్లో వస్తుంది. దీనినే మనం పెళ్లి కళ వచ్చింది అని అంటుంటాం. ఇది మగవారిలో, ఆడవారిలోనూ ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత ఆడవారితో పోల్చితే మగవారు లావెక్కె అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇదేదో సరదాగా చెప్తున్న విషయం కాదు, పరిశోధనలు నిర్వహించి మరీ ఈ వివరాలను వెల్లడించారు. 

24

పెళ్లి కానీ వారితో పోల్చితే పెళ్లయిన పురుషుల్లో అధిక బరువు ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉంటుందని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టియాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే మహిళల్లో ఇది కేవలం 39 శాతం మాత్రమే ఉంటుందని అధ్యయనంలో తేలింది. పురుషుల్లో ఊబకాయం సమస్యను వివాహం మూడు రెట్లు పెంచుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. 
 

34

ఈ విషయాన్ని పరిశోధకులు ఎలా తెలిపారంటే.? 

ఇందుకోసం పరిశోధకులు మల్టీ సెంటర్‌ నేషనల్‌ పాపులేషన్‌ హెల్త్‌ ఎగ్జామినేషన్‌ సర్వే నుంచి 2405 మంది డేటాను పరిశీలించారు. వీరిలో 50 ఏళ్ల వయసులో 35.3 శాతం మంది సాధారణ బరువు కలిగి ఉండగా.. 38.3 శాతం మంది అధిక బరువు, 26.4 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది.

ఊబకాయానికి.. వయస్సుకు, వైవాహిక స్థితికి, మానసిక స్థితికి మధ్య సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. పెళ్లి కానీ పురుషులతో పోల్చితే, పెళ్లైన వారిలో ఊబకాయం బారిన పడే అవకాశం 3.2 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. అయితే మహిళల్లో ఈ సమస్య తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. 
 

44
pregnancy

ఇంతకీ పెళ్లి తర్వాత పురుషులు బరువు ఎందుకు పెరుగుతారు.? 

పెళ్లి తర్వాత మగవారు బరువు పెరగడానికి గల కారణాలను ఒబెసిటీ హెల్త్‌ అలయెన్స్‌ డైరెక్టర్‌ కాథరిన్‌ జెన్నెర్‌ వివరించారు. పెళ్లైన తర్వాత ఆహారం ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ తగ్గడం ఊబకాయానికి దారి తీస్తాయని తెలిపారు. అయితే మహిళల విషయంలో ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. కొన్ని సామాజిక ఒత్తిళ్ల కారణంగా మహిళలు శరీర బరువు విషయంలో జాగ్రత్తగా ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. 

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పరిశోధనల్లో తేలిన సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

click me!

Recommended Stories