Kitchen Hacks: ఫ్రిజ్ లో పెట్టినా కొత్తిమీర, పుదీనా నల్లగా మారుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే పచ్చగా ఉంటాయి

Published : Sep 24, 2026, 10:06 AM IST

Kitchen Hacks: ఫ్రిజ్ లో పెట్టినా కూడా ఒక్కోసారి కొత్తిమీర, పుదీనా ఆకులు చివర్లు నల్లగా మారిపోతాయి. వాటిని ఫ్రిజ్ లో వారాల తరబడి తాజాగా ఉంచాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకోండి.

PREV
13
కొత్తిమీర, పుదీనా నిల్వ చిట్కాలు

ప్రతిరోజూ వంటల్లో వాడే కొత్తిమీర, పుదీనా అందరి ఇళ్లల్లో ఉంటుంది. ఇవి ఆహారానికి అద్భుతమైన రుచిని, సువాసనను ఇస్తాయి. అయితే, వీటిని మార్కెట్ నుండి తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టిన కేవలం రెండు మూడు రోజుల్లోనే నల్లగా మారిపోతుంటాయి. ఈ చిన్న సమస్య గృహిణులకు ఎప్పుడూ ఇబ్బందికరంగా మారుతుంది. అయితే, కొన్ని సులభమైననిల్వ చేసే పద్ధతులు (Storage Hacks) పాటించడం ద్వారా కొత్తిమీర, పుదీనాను ఎటువంటి పాడైపోకుండా వారాల తరబడి తాజాగా పచ్చగా ఉండేలా కాపాడుకోవచ్చు.

23
ఇలా చేయండి

ఈ ఆకుకూరలను ఫ్రెష్‌గా ఉంచడానికి గ్లాస్ జార్ పద్ధతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం కొత్తిమీర లేదా పుదీనా కాడల కింది భాగాలను కొద్దిగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో కొద్దిగా నీరు పోసి, ఈ కాడలను అందులో నిటారుగా ఉంచాలి. తేమ ఆవిరి కాకుండా పైన ఏదైనా పాలిథిన్ కవర్‌తో కవర్ చేసి ఫ్రిజ్‌లో అమర్చాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తూ ఉంటే సరిపోతుంది. అలాగే, ఆకులు నల్లగా మారడానికి ప్రధాన కారణం వాటిపై ఉండే అదనపు తేమ. కాబట్టి మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే వాటిని కడగకూడదు. ఒకవేళ తడిగా ఉంటే ముందుగా ఫ్యాన్ గాలిలో పూర్తిగా ఆరబెట్టాలి. ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పేపర్ టవల్ (టిష్యూ పేపర్) పరిచి, దానిపై ఆకులను ఉంచి పైన మరో పేపర్ టవల్‌తో కప్పి గాలి తగలకుండా మూసేయాలి.

33
మరొక పద్దతిలో

మరో సులువైన మార్గంలో కొత్తిమీర, పుదీనా కట్టలలో ఉన్న పాడైపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే ఏరివేయాలి. లేదంటే ఆ కుళ్ళిన ఆకుల వల్ల మిగతా మంచి ఆకులు కూడా వేగంగా పాడైపోతాయి. ఆ తర్వాత వాటిని శుభ్రమైన టిష్యూ పేపర్‌లో చుట్టి, ఒక జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచాలి. బ్యాగ్‌లోని గాలిని పూర్తిగా బయటకు తీసి గట్టిగా సీల్ చేయాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు వీటిని ఎప్పుడూ కడగకూడదు. నీరు తగలడం వల్ల ఇవి అతి త్వరగా నల్లగా మారిపోతాయి. మీకు కావలసినప్పుడు, వంటలో వాడే ముందు మాత్రమే వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మీ ఇంట్లోని కొత్తిమీర, పుదీనా ఎల్లప్పుడూ తాజాగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories