ఆగస్టు 17 చాలా ప్రత్యేకమైన రోజు.. ఎందుకో తెలుసా

First Published | Aug 16, 2024, 4:20 PM IST

ఈ సంవత్సరం ఆగస్టు నెలలో వస్తున్న 17వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రోజు శనిత్రయోదశి. అదేంటీ చాలా శని త్రయోదశిలు వస్తుంటాయి కదా.. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో 17న వస్తున్న త్రయోదశికే ఎందుకంత విశిష్టత అంటారా.. ఆ వివరాలు తెలుసుకుందాం.. రండి..
 

మనిషి జీవిత ప్రయాణాన్ని ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. నక్షతాలు, గ్రహాల గమనం, యోగం, కరణం, వారం, తిధి ఇలా అనేక విషయాలపై ప్రతి ఒక్కరి జీవితం ఆధార పడి నడుస్తుంది. వేద శాస్త్రాల ప్రకారం పుట్టిన ప్రతి మనిషి జీవితం ముందే నిర్ణయించబడి ఉంటుందట. సుఖాలను ఎంజాయ్ చేస్తారు. కాని కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోలేక భగవంతుడిని ప్రార్థిస్తారట. 
 

శని త్రయోదశి విశిష్టత ఏమిటంటే

అందుకే లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పండితులను కలుసుకొని పరిహారాలు అడుగుతారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 17కు ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే.. ఆ రోజు శనివారం, త్రయోదశి తిథి కలిసింది. అంటే శని త్రయోదశి అన్నమాట. మరి ఈ నెలలో ఈ శని త్రయోదశి విశిష్టత ఏమిటంటే డేట్ 17-8-2024.


17-8-2024 పరిశీలించండి..

తేదీ 17 అంటే 1, 7 కలిపితే =8
నెల ఆగస్టు = 8
సంవత్సరం 2024 మొత్తం కలిపితే=8
ఇలా 8 8 8 రావడం చాలా అరుదు. అందులోనూ శని త్రయోదశి రోజు రావడం ఇంకా గొప్ప విషయం. అందువల్ల ఈ శని త్రయోదశి రోజు శనేశ్వరుడికి ప్రదక్షిణలు, తైలాభిషేకాలు, నువ్వుల దానాలు తదితర పూజా కార్యక్రమాలు చేయిస్తే మన జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. 

జోతిష్య, ఖగోళ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

17-8-2024 తేదీని ఏ నంబరుకు ఆ నంబరు కలిపితే 8 8 8 వస్తున్నాయి. ఇలా ఓ డేట్ ను కలిపితే ఒకే నంబరు రావడం చాలా అరుదు. ఇలా నంబర్లు కలిసినప్పుడు యూనివర్స్ నుంచి కాశ్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా భూమిని చేరుతుందట. ముఖ్యంగా ఆ శక్తి దేవాలయాల్లో ఎక్కువగా ప్రసరిస్తుందట. అందువల్ల ఆలయాల్లో కాస్త సమయం గడపడం వల్ల ఆ కాశ్మిక్ కిరణాలు మనల్ని తాకుతాయని జోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రేస్ తాకడం వల్ల శరీరం ఎక్కువ ఎనర్జీని పొందుతుందట. అందువల్ల మనం అనుకున్న పనులు సాధించగలమని జోతిష్యులు చెబుతున్నారు. 

Latest Videos

click me!