మధ్యాహ్నం కచ్చితంగా నిద్రపోవాలట.. ఎందుకో తెలుసా

First Published | Aug 16, 2024, 3:16 PM IST

మనిషికి కంటి నిండా నిద్ర చాలా అవసరం కదా..  రాత్రి సమయంలో తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. మరి మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదా కాదా.. డాక్టర్లు, పరిశోధకులు ఏమంటున్నారో తెలుసుకుందామా..

మనిషికి తిండి ఎంత అవసరమో.. సరిపడా నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిపోక ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ డాక్టర్ల వద్దకు క్యూ కడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం మధ్యాహ్నం నిద్ర అంటున్నారు కొందరు వైద్యులు. నిద్రలేమి వల్ల కలిగే హెల్త్ ప్రాబ్లమ్స్ పై విదేశాల్లో కొన్ని యూనివర్సిటీలు చాలా పరిశోధనలు చేశాయి. 

ఎంప్లాయిస్‌కి నిద్ర చాలా ముఖ్యం..

మధ్యాహ్నం ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్లు తమ కళ్లు బరువెక్కినట్టుగా గుర్తించారట.  ఆ సమయంలో చిన్న నేప్‌ వేయడంతో చాలా రిలాక్స్ అయినట్లు పరిశోధకులకు తెలిపారు.  ఇదే విషయంపై ఎక్కువ మందిని టెస్ట్‌ చేయగా చాలా మందిలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. దీంతో మధ్యాహ్నం నిద్ర మంచిదేనని వారు నిర్ధారించారు. ముఖ్యంగా షిష్ట్‌ల్లో పనిచేసేవారు, లాంగ్‌డ్రైవ్‌ చేసేవారు, మధ్యలో కొంచెం కునుకుతీయడం అన్ని విధాలా మంచిది అంటున్నారు. 

Latest Videos


వైద్యులేమంటున్నారంటే..

ఒత్తిడిగా వర్క్ చేసేవాళ్లు మధ్యాహ్నం పూట కాస్త కునుకు లాగితే గుండె పనితీరు నెమ్మదించకుండా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం కొంచెం సేపు పడుకుంటే మెడదు కూడా రిలాక్స్ అయి బాగా పని చేస్తుందని గుర్తించారు. 
 

‘స్లీప్ రీసెర్చ్’ పరిశోధనల్లో ఏం గుర్తించారో తెలుసా..

విక్టోరియా గార్ఫీల్డ్ అనే పరిశోధకురాలు కొంతమందిపై వివిధ పరిశోధనలు చేశారు. వారిలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇలా అనేక రకాల వారిని మధ్యాహ్నం పూట ఓ అరగంట నిద్రపోయేలా చేశారు. నిద్ర లేచిన తర్వాత విద్యార్థులు మ్యాథ్స్‌ బాగా చేయడం గుర్తించారు. ఎంప్లాయిస్‌ కొత్తదనంగా ఆలోచించడం గమనించారు. ఓల్డ్‌ ఏజ్‌ పీపుల్స్‌లో గుండె ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండటాన్ని తెలుసుకున్నారు. ఈ విషయాలన్నీ ‘స్లీప్ రీసెర్చ్’ అనే పత్రికలో వచ్చాయి.

ఎంత సేపు నిద్రపోతే మంచిది..

మధ్నాహ్నం ఓ 20 నిమిషాలు పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీలో పనిచేస్తున్న నటాలి డాటోవిచ్ బృందం వెల్లడించింది.  గంట నుంచి గంటన్నరసేపు పడుకుంటే మరింత మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు. అంతే కానీ మధ్యలో లేస్తే అంత మంచి ప్రభావం ఉండదు అని గమనించారు.

click me!