సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు. అప్పటి వరకు దక్షిణం దిశగా ప్రయాణించిన సూర్యుడు సంక్రాంతి మొదలు ఉత్తరం వైపునకు ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ విషయాన్ని మన పూర్వీకులు చెప్పగా చక్కటి సాంప్రదాయంగా భారతదేశంలో ప్రజలు నిర్వహిస్తున్నారు. అయితే సంక్రాంతి సంక్రమణం వెనుక మనకు తెలియని ఖగోళ విషయాలు, చరిత్ర, సంస్కృతి ఇలా ఎన్నో దాగి ఉన్నాయి. అవేంటో వివరంగా తెలుసుకుందాం.
మకర సంక్రాంతి మూలాలను ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఏనాడో కనుగొన్నారు. వారు సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశలో ప్రయాణించడాన్ని ఖగోళ లెక్కల ద్వారా కనిపెట్టారు. ఖగోళ శాస్త్రజ్ఞులు ఆకాశాన్ని 27 నక్షత్రాలు, 12 రాశులుగా విభజించారు. వీటిని ఉపయోగించి సూర్యుడి గమనాన్ని ట్రాక్ చేసే విధానాన్ని తయారు చేశారు. దీని ద్వారా ప్రతి ఏడాది మకర సంక్రాంతి పండగను నిర్ణయించారు. అందువల్లనే ఒక్కో సంవత్సరం ఒక్కో తేదీలో సంక్రాంతి వస్తుంది.
సంక్రాంతి పండగను ఎలా కనిపెట్టారో తెలిసింది. కాని అసలు ఈ సంక్రాంతి పండగను ఎప్పుడు కనిపెట్టారో తెలుసుకోవడానికి ఈ తరం సైన్టిస్టులు మోడరన్ ప్లానిటేరియం సాఫ్ట్వేర్ ఉపయోగించారు. దీని ద్వార ఖగోళ గమనాలను సిమ్యులేట్ చేశారు. ఆశ్చర్యకరంగా 400 బి.సి. కాలం నుంచి సంక్రాంతిని నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. అంటే క్రీస్తు పుట్టక ముందు నుంచే భారతదేశంలో సంక్రాంతిని ఓ ముఖ్యమైన పండగలా నిర్వహించడం ప్రారంభమైందని అర్థమవుతోంది.
భారతదేశం వ్యవసాయ చరిత్రను పరిశీలిస్తే నువ్వులు పంట కోతకొచ్చిన తర్వాత సంక్రాంతి పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలుస్తుంది. అయితే ఈ నువ్వులు పంట 400 బి.సి. కాలం నుంచి ఇండియాలో సాగు చేయడం ప్రారంభమైందని చారిత్రక ఆధారం ఉంది. దీంతో సంక్రాంతి పండగ 400 బి.సి. కాలం నుంచి నిర్వహిస్తున్నారని నిర్ధారణ అయ్యింది.
ప్రాచీన భారతీయులు సౌకర్యవంతమైన లూనీ-సోలార్ టైం కాలిక్యులేటర్ ఉపయోగించారు. ఇది సూర్య, చంద్ర సంవత్సరాల మధ్య తేడాలను అడ్జస్ట్ చేసి కరెక్ట్ టైంని ఇస్తుంది. ప్రాచీన భారతీయులు ఈ విధంగా కాలాన్ని లెక్కించారని సూర్య సిద్భాంతం వంటి గ్రంథాలలో రికార్డయింది. ఇది ఈ కాలంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి చెక్ చేసినప్పుడు కరెక్టేనని ఈ తరం ఖగోళ సైన్టిస్టులు నిర్ధారించారు.