ఒక్క ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతుంటాయి. కానీ ఆడవాళ్లు చెప్పుకున్నట్టుగా మగవారు వెంట్రుకలు ఊడిపోతున్నట్టు ఎవ్వరితోనూ చెప్పుకోరు. కానీ వారి నెత్తిని చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మగవారికి వెంట్రుకలు ఊడిపోతే బట్టతల వస్తుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం పెట్టాలి?
మెంతులు
మెంతుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మన జుట్టుకు కూడా మంచి మేలు చేస్తాయి. మెంతుల్లో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. జుట్టును బలంగా చేస్తాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని మెంతులను తీసుకుని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేయండి.
రైస్ వాటర్
రైస్ వాటర్ ఒక్క చర్మానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ వాటర్ ను ఉపయోగించి మీరు జుట్టు రాలకుండా చేయొచ్చు. రైస్ వాటర్ లో అమైనో యాసిడ్స్, న్యూట్రీషియన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలంగా చేస్తాయి. ఇందుకోసం మీరు రైస్ వాటర్ ను జుట్టంతా పట్టించండి. కాసేపు మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయండి.
కొబ్బరి పాలు
కొబ్బరి పాలతో కూడా జుట్టు ఊడటాన్ని తగ్గించుకోవచ్చు. కొబ్బరి పాలలో విటమిన్లు, ఖనిజాలు, కెరాటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ నెత్తికి మంచి పోషణను అందిస్తాయి. అలాగే జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. వెంట్రుకలు ఊడిపోకుండా ఉండేందుకు మీరు కొబ్బరి పాలను తలకు పెట్టి కొద్ది సేపటి తర్వాత చల్ల నీళ్లతో కడిగేయండి.
ఉల్లిపాయ రసం
ఉల్లిరసం కూడా జుట్టును రాలకుండా చేయడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన నెత్తిమీద రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే జుట్టు పెరిగేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఉల్లిరసంతో జుట్టు రాలకుండా ఉండేందుకు మీరు స్నానానికి ముందు ఉల్లిపాయ రసాన్ని తలకు బాగా పట్టించండి.
గుడ్డు
గుడ్డు కూడా జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఖనిజాలు, ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని ఆపుతాయి. అలాగే మీ జుట్టు పొడుగ్గా, మందంగా పెరిగేందుకు సహాయపడతాయి. ఇందుకోసం గుడ్డును తలకు పట్టించి 20-25 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి.
అల్లం
అల్లం మన జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అల్లాన్ని ఉపయోగించి మనం జుట్టు రాలడాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇది ఒక మంచి నేచురల్ రెమెడి. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు మన నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతాయి. జుట్టుకు అవసమరైన పోషణను అందిస్తాయి. దీంతో జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.
hair loss
కరివేపాకు
కరివేపాకు జుట్టును నల్లగా చేయడమే కాకుండా.. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు ఇది జుట్టు బాగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడానికి సహాయపడతాయి. చిన్న వయసులో బట్టతల, తెల్ల వెంట్రుకలు రాకుండా కాపాడుతాయి.