
కుంకుమ పువ్వును గర్భిణులు మాత్రమే ఎక్కువగా తింటుంటారు. పుట్టబోయే బిడ్డ ఎర్రగా బుర్రగా పుట్టాలని గర్భిణులు తింటారని పెద్దలు చెప్తారు. నిజానికి కుంకుమ పువ్వుకు పిల్లలు ఎర్రగా బుర్రగా పుట్టడానికి అసలు సంబంధమే లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు కుంకుమ పువ్వును తినడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు.
ఇక ఈ కుంకుమ పువ్వును చర్మ సౌందర్యం కోసం కూడా వాడుతుంటారు. అంతేకాదు ఇది ఎన్నో శరీర సమస్యలను కూడా తొలగించడానికి సహాయపడతుంది.
కుంకుమ పువ్వులో భాస్వరం, కాల్షియం, ఇనుము మొదలైన ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లలకు, వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుంకుమ పువ్వు ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా ఫిట్ గా కూడా ఉంచుతుంది.
కాగా కుంకుమ పువ్వును పురుషులు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే కుంకుమ పువ్వు పురుషులకు ఒక వరం లాంటిదనే చెప్పాలి. ఇంతకి వీరు కుంకుమ పువ్వును తినడం వల్ల ఎలాంటి సమస్యలు తొలగిపోతాయో తెలుసుకుందాం పదండి.
శరీరక బలహీనత (Physical weakness): శారీరక బలహీనతతో బాధపడే పురుషులకు కుంకుమ పువ్వు (Saffron) దివ్య ఔషదంలా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల మగవారు బలంగా తయారవుతారు. ఎందుకంటే కుంకుమ పువ్వులో బాడీలోని కండరాలను బలంగా చేసే గుణాలు ఉంటాయి. ఇందుకోసం కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగొచ్చు.
అకాల స్ఖలనం (Premature ejaculation) సమస్య: అకాల స్ఖలనం సమస్యతో బాధపడుతున్న పురుషులకు కుంకుమ పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఈ సమస్య మానసిక ఒత్తిడి వల్ల కలుగుతుంది. ఇలాంటి వారు కుంకుమ పువ్వును తీసుకుంటే మానసిక ఒత్తిడి (Mental stress) తగ్గుతుంది. దీంతో అకాల స్ఖలనం సమస్య పూర్తిగా తొలగిపోతుంది.
లైంగిక శక్తిని పెంచుతుంది.. కుంకుమ పువ్వు పురుషుల్లో లైంగిక (Sexual) కోరికలను పెంచుతుంది. అయితే ఈ రోజుల్లో చాలా మంది పురుషులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి వారిలో లైంగిక కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి. దీనివల్ల వీరి లైంగిక జీవితం సాఫీగా సాగదు. ఇలాంటి వారు Regular గా కుంకుమ పువ్వును తినాలి. దీనివల్ల వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది.
క్యాన్సర్ నివారణగా.. కుంకుమ పువ్వు ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది. కుంకుమ పువ్వులో ఉండే కరోటినానే ప్రమాదాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఇది పురుషులకు సోకే ప్రొస్టేట్ క్యాన్సర్ (Prostate cancer) ను నివారించడానికి ఎంతో సహాయడుతుంది. ఈ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుగా నిలుస్తుంది.