వరుణ్ ధావన్ కండల వెనక అసలు రహస్యం ఇదే..!

First Published Sep 14, 2021, 3:24 PM IST

లంచ్ లో..బ్రౌన్ రైస్, మూడు చపాతీలు, బ్రోకలీ , ఎగ్ బేక్డ్ చికెన్ తీసుకుంటారు. ఇక  వరుణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ భోజనం మాత్రం ఇంటి నుంచే తెప్పించుకుంటాడట.అందుకే తన మెనూలో ఎలాంటి మార్పు జరగకుండా జాగ్రత్త తీసుకుంటారట. 

బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్..  వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో.. బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన వరుణ్ .. అప్పటి నుంచి వరస సినిమాలతో.. తన అద్భుతమైన నటన, డ్యాన్స్ లతో ఆకట్టుకుంటున్నాడు.

ఇక వరుణ్ ధావన్ నటనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో.. ఆయన బాడీకి ముఖ్యంగా కండలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అసలు వరుణ్ ధావన్ అంత ఫిట్ గా ఉండటానికి.. ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారో.. ఆయన ఫాలో అయ్యే డైట్ ఫ్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వరుణ్ ధావన్ బ్రేక్ ఫాస్ట్ లో..  ఉదయాన్నే ఆమ్లేట్స్ , శాండ్ విచ్, ఓట్స్ తీసుకుంటారు. ప్రతి ఉదయం దీనేనే బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారట. ఇవి తింటే తన పొట్ట ఫుల్ అయిపోతుందని వరుణ్ చెబుతున్నాడు.
 

లంచ్ లో..బ్రౌన్ రైస్, మూడు చపాతీలు, బ్రోకలీ , ఎగ్ బేక్డ్ చికెన్ తీసుకుంటారు. ఇక  వరుణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ భోజనం మాత్రం ఇంటి నుంచే తెప్పించుకుంటాడట.అందుకే తన మెనూలో ఎలాంటి మార్పు జరగకుండా జాగ్రత్త తీసుకుంటారట. 
 

ఇక స్నాక్స్ లో.. వరుణ్.. పండ్లు, ప్రోటీన్ షేక్స్ తీసుకుంటారు. ఇక డిన్నర్ లో తేలికపాటి భోజనం తీసుకుంటారు. ఉడకపెట్టిన కూరగాయలు, కాల్చిన చేపలను తీసుకుంటారట. హెవీ ఫుడ్ మాత్రం తీసుకోరట.
 

ఈ మెనూతో పాటు, వ్యాయామం చేయడానికి వరుణ్ తన శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ప్రతిరోజూ, జిమ్ లో కసరత్తులు చేస్తారు. తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. తన బరువును కంట్రోల్ లో పెట్టుకుంటారు.

కొన్నికొన్ని సార్లు.. సినిమా షూటింగ్ ల నేపథ్యంలో.. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందట. ఆ సమయంలో డైట్ ఏమైనా మిస్ అయితే.. వెంటనే ఆయన డైటీషియన్లను సంప్రదిస్తారట.  వారు ఏ ఆహారం తీసుకోవాలో సూచిస్తే.. వాటినే తీసుకుంటారట.

వరుణ్ ధావన్ ప్రస్తుతం అనేక సినిమాలకు పని చేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి చిత్రాలు విడుదల కోసం వేచి ఉన్నాయి. అయితే, అతని చివరి సినిమా మాత్రం.. పెద్దగా ఆకట్టుకోకపోవడం గమనార్హం.
 

click me!