డయాబెటీస్ ఉంటే ఆలుగడ్డలు తినొద్దా?

Published : Dec 13, 2022, 01:04 PM IST

బంగాళాదుంపల్లో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహులు బంగాళాదుంపలను తినొద్దంటారు నిపుణులు.   

PREV
15
డయాబెటీస్ ఉంటే ఆలుగడ్డలు తినొద్దా?

కూరగాయలను, బంగాళాదుంపలను తినడానికి, టైప్ 2 డయాబెటీస్ కు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. డానిష్ పరిశోధకులు ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో.. ఎక్కువ కూరగాయలను ఎక్కువగా తినేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 21% తక్కువగా ఉందని కనుగొన్నారు. 

కార్బోహైడ్రేట్లకు గొప్ప వనరు బంగాళాదుంపలు. రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యంగా ఉండే డయాబెటిస్ రోగులు ఆలుగడ్డలను ఎప్పుడూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

25

అయితే డయాబెటీస్ వండే విధానాన్ని మార్చితే  మధుమేహులు కూడా తినొచ్చు. బంగాళాదుంప ఫ్రైస్ / చిప్స్ అలాగే ఉడికించిన, కాల్చిన బంగాళాదుంపలు టైప్ 2 డయాబెటిస్ తో సానుకూలంగా ప్రభావాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనం కనుగొంది. మాష్ చేసిన బంగాళాదుంపలు, బంగాళాదుంప ఫ్రైస్ / చిప్స్ మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. జీవక్రియ ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయని అధ్యయనం తెలిపింది. ఉడికించిన బంగాళాదుంపలు, డయాబెటిస్ మధ్య సానుకూల సంబంధం ఉందని ఇది కనుగొంది. 
 

35

ఈ అధ్యయంలో మొత్తం 54,793 మంది పాల్గొన్నారు. దీనిలో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు 7,695 మంది పాల్గొన్నారు. అధ్యయనం వెల్లడించిన ప్రకారం.. కూరగాయల ఎక్కువగా తీసుకోవడం వల్ల టైప్ 2  డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా  తక్కువగా ఉంటుంది. ఇందుకోసం రోజుకు 150 నుంచి 250 గ్రాముల కూరగాయల తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 200, 400 గ్రాముల మధ్య కూరగాయల తీసుకోవడం వల్ల 12–14% వరకు డయాబెటీస్ ప్రమాదం తక్కువగా ఉంటుందని కనుగొనబడింది. 

అయితే కూరగాయలను తక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధన తెలియజేస్తుంది. మొత్తం కూరగాయలను రోజుకు 250 గ్రాములు కంటే తక్కువగా తీసుకోవడం ప్రమాదకరమని పరిశోధకులు తేల్చారు. 
 

45


ఐతే డయాబెటిస్ ఉన్నవారు ఆలుగడ్డలను పూర్తిగా తినకూడదా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎప్పుడూ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు ఆలుగడ్డలను తనకపోవడమే మంచిది. నిజానికి ఆలుగడ్డలో పొటాషియం,  బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆలుగడ్డ పొట్టులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కానీ బంగాళాదుంపల్లో  కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. అయితే కుఫ్రి కుబేర్, కుఫ్రి ఖాసిగారో, కుఫ్రి ముత్తు, కుఫ్రి నవీన్, కుఫ్రి పుష్కర వంటి కొన్ని రకాల బంగాళాదుంపల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. వీటిని ఎంచక్కా తినొచ్చు. 
 

55

ఉడికించిన బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బంగాళాదుంపలను మెంతికూర, బెండకాయ వంటి అధిక ఫైబర్ కూరగాయలతో వండటం వల్ల మొత్తం గ్లైసెమిక్ సూచిక తగ్గుతుంది. గ్లూకోజ్ అధికంగా పెరగకుండా ఉండటానికి వీటిని తక్కువగా తినండి. 

బంగాళాదుంపలను నూనెలో వేయించడం వల్ల కేలరీలు, మొత్తం గ్లైసెమిక్ లోడ్ పెరుగుతుంది. అందుకే బంగాళాదుంపలను వెనిగర్ లేదా ఇతర అధిక ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్ ఆయిల్ తో వండండి. దీనివల్ల  గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories