టైప్ 2 డయాబెటిస్ వల్ల అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, పాదాల్లో తిమ్మిరి, దృష్టి లోపాలు, చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. చిన్నవయసులోనే మధుమేహం రావడానికి ఊబకాయం ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధిక కేలరీలు, చక్కెర, కొవ్వు వంటి ఆహారాలను తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇకపోతే చిన్న వయసులోనే మధుమేహం రావడానికి ఒత్తిడి కూడా మరో కారణమంటున్నారు నిపుణులు.