షుగర్ పేషెంట్లు సీతాఫలాలు తినొచ్చా..?

First Published Sep 20, 2022, 9:52 AM IST

సీతాఫలాలు తియ్యగా ఉంటాయి. అందుకే వీటిని మధుమేహులు అస్సలు తినకూడదని కొందరు అంటుంటారు. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి. 
 

సీతాఫలాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండు ఆరోగ్యానికే కాదు అందానికి కడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలహీనతను తొలగించడమే కాదు రక్త ప్రసరణను కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఈ పండు ఎన్నో దీర్ఘకాలిక రోగాలను కూడా పోగొట్టడానికి సహాయపడుతుంది. అలాగే ఇమ్యూనిటీ శక్తిని కూడా పెంచుతుంది. 

అయితే ఈ పండు చాలా తియ్యగా ఉంటుంది. అందుకే మధుమేహులు ఈ పండును తినడం మంచిది కాదని చాలా మంది చెప్తుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం... డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా సీతాఫలాన్ని తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను తిన్నా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవు. ఎందుకంటే ఇది తక్కువ జిఐ (గ్లైసెమిక్ ఇండెక్స్) ఆహారం. 
 

సీతాఫలాల్లో పాలీ ఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తి, గ్లూకోజ్ శోషణను బాగా పెంచుతాయి. దీంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది. 100 గ్రాముల సీతాఫలంలో  20 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఇనుము ఇన్సులిన్ ఉత్పత్తిని పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గతాయి. 
 

సీతాఫలాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపు సమస్యలను, అల్సర్లు, ఆమ్లత్వాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 100 గ్రాముల సీతాఫలంలో ఆపిల్ పండ్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే సగం నారింజ పండులో ఉండే విటమిన్ సి దీనిలో ఉంటుంది. ఇకపోతే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటే మెగ్నీషియం మంచి ప్రేగు కదలికలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఈ సీతాఫలాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్, కొరోనరీ హార్ట్ డిసీజ్ వంటి వ్యాధులను కూడా నివారిస్తాయి. అయితే ఈ సీతాఫలాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ట్యూమర్, యాంటీ-ఒబెసిటీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీవైరల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు కూడా ఉండొచ్చని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. 
 

వీటితో పాటుగా.. బరువు తక్కువగా ఉన్నామని బాధపడేవారికి సీతాఫలం చక్కగా ఉపయోగపడుతుంది. దీన్నీ జ్యూస్ గా చేసుకుని అందులో పాలు, హనీ కలుపకుని తాగితే శరీర బరువు పెరుగుతుంది. ఇక గర్భిణులు ఈ పండ్లను తింటే కడుపులో బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా గర్భస్రావం అయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఈ పండులో ఉండే బిటమిన్ బి6 ఆస్త్మాటిక్స్ అటాక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. 

సీతాఫలంలో ఉండే మెగ్నీషియం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు ఈ పండు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ పండులో పుష్కలంగా ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. 

ఈ పండును తినడం వల్ల దంతక్షయం, పంటి నొప్పి తగ్గుతాయి. ఈ పండ్లు కంటి ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం జాయింట్స్ పెయిన్ ను తగ్గించడానికి సహాయడుతుంది. అలాగే ప్రసవం తర్వాత ఓవర్ వెయిట్ నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. ఓవర్ గా తినాలన్న కోరికను కూడా పోగొడుతుంది. 

click me!