తులసి గింజల ప్రయోజనాలు తెలిస్తే.. వాటిని తీసుకోకుండా అస్సలు ఉండలేరు తెలుసా..!

First Published Sep 19, 2022, 3:57 PM IST

తులసి ఆకులతో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు.. కానీ వీటి గింజలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. 
 

మన దేశంలో ప్రతి ఇంటి ముందు తులసి కోట ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజూ పూజకూడా చేస్తుంటారు. దైవంగా కొలిచే తులసిలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఇవి ఎన్నో ప్రమాదకరమైన జబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి. రోజూ కొన్ని తులసి ఆకులను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అయితే తులసి ఆకులే కాదు గింజలు కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, ఫినాలిక్, ఫ్లేవనాయిడ్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలను రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతామో తెలుసుకుందాం పందండి. 
 

రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటేనే.. అంటు వ్యాధులు, ఇతర రోగాలు సోకకుండా ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే సర్వరోగాలు మనకే చుట్టుకునే అవకాశం ఉంది. అయితే తులసి గింజలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం తులసి గింజల కాషాయాన్ని తాగండి. 

ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు తులసి గింజలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం తులసి గింజలను నీళ్లలో బాగా నానబెట్టండి. అవి ఉబ్బిన తర్వాత నీటితో సహా మొత్తం తాగండి. దీంతో జీర్ణసమస్యలు తొలగిపోతాయి. 

ఓవర్ వెయిట్ అస్సలు మంచిది కాదు. దీనివల్ల స్ట్రోక్, కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండెపోటు, డయాబెటీస్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. అయితే తులసి గింజలు కూడా బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ గింజల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు. 
 

tulsi

మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

మానసిక ఒత్తిడి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే దీని నుంచి వీలైనంత తొందరగా బయటకు రావాలి. కాగా తులసి గింజలు ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

తులసి గింజలను తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం చాలా వరకు తగ్గతుందని ఓ పరిశోధన వెల్లడించింది. ఈ గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. అలాగే శరీరానికి హాని చేసే ఫ్రీరాడిక్స్ నుంచి రక్షిస్తాయి.  దీనిలో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల రక్తహీనత సమస్య పోతుంది. అంతేకాదు ఈ గింజలు వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే ముడతలను తగ్గిస్తాయి. 
 

click me!