రాత్రిపూట వీటిని పొరపాటున కూడా తినకండి.. తిన్నారో మీ పని అంతే..!

First Published Sep 19, 2022, 4:54 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఎంత ముఖ్యమో.. నైట్ డిన్నర్ కూడా అంతే ముఖ్యం. అలా అని ఏది పడితే అదితింటే మాత్రం మీ చేతులారా మీఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నవారవుతారు జాగ్రత్త.. 
 

ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా ఖచ్చితంగా తినాలి. కొంతమంది మాత్రం బరువు పెరిగిపోతున్నామని ఉదయం, రాత్రి అసలే తినరు. దీనివల్ల బరువు తగ్గడం కాదు కదా.. మరింత బరువు పెరిగిపోయి.. ఎన్నో రోగాలు చుట్టుకుంటాయి. అందుకే మూడు పూటలా ఖచ్చితంగా తినాలి. తినాలి కదా అని ఏది పడితే అది తిన్నా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను చేయడం వల్ల పొద్దంతా మీరు ఎనర్జిట్ గా ఉంటారు. అయితే కొంతమంది రాత్రి పూట తినడం మంచిది కాదని తక్కువ తినడమో.. లేకపోతే మొత్తమో తినకపోవడమే చేస్తుంటారు. కడుపును ఖాళీగా ఉంచడం మంచిది కాదు. ఖచ్చితంగా రాత్రిపూట తినాలంటున్నారు నిపుణులు. అది కూడా రాత్రి 7 గంటల లోపే తినడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రిపూట తినే వారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏవి పడితే అది తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రిపూట సులువుగా జీర్ణమయ్యే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 
 

అందుకే రాత్రిపూట ఏమి తినకూడదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే కొంతమంది రాత్రి పూట మాంసం, పెరుగు, చికెన్, పరాటా తింటుంటారు. కానీ రాత్రిపూట వీటిని తినడం అస్సలు మంచిది కాదు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి భోజనం తేలికగా ఉండాలి. కఫానికి కారణమయ్యే ఆహారాలను రాత్రిపూట తినకూడదు. ఇంతకు రాత్రిపూట ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం పదండి.
 

పెరుగు

పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. కడుపును చల్లగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటుగా మరెన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అందుకే పెరుగును ఒక కప్పైనా రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. అయితే రాత్రిపూట పెరుగును తినడం అంత మంచిది కాదంటున్నారుు నిపుణులు. కానీ చాలా మంది రాత్రిపూట పెరుగును అన్నం లేదా పరాటా లేదా రోటీతో తింటారు. దీనివల్ల పొట్ట చల్లగా ఉంటుందని ఇలా తీసుకుంటూ ఉంటారు. ఆయుర్వేదం ప్రకారం.. పెరుగు కఫం, పిత్తాన్ని పెంచుతుంది. రాత్రిపూట పెరుగును తినడం వల్ల దగ్గు వస్తుంది. అలాగే గొంతునొప్పి, గొంతులో చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే రాత్రిపూట పెరుగుకు బదులుగా మజ్జిగను తీసుకోండని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 
 

మైదా 

మైనా పిండితో చేసిన ఎలాంటి స్వీట్ అయినా.. మరేదైనా ఫుడ్ అయినా బలే టేస్టీగా ఉంటుంది. కానీ మైదా పాయిజన్ తో సమానం. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మైదాను ఎక్కువగా తీసుకుంటే పైల్స్, మలబద్దకం సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ మైదాను రాత్రిపూట తీసుకుంటే అది జీర్ణం అవడం కష్టంగా మారుతుంది. అందుకే మైదాను ఎట్టిపరిస్థితిలో రాత్రిపూట తీసుకోకండి. 

గోధుమ ఆహారం

రాత్రిపూట అన్నానికి బదులుగా గోధుమ రొట్టెలనే ఎక్కువగా తినేవారున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అన్నం తింటే బరువు మరింత పెరుగుతుందని గోధుమ రొట్టేలను తింటుంటారు. కానీ రాత్రి పూట గోధుమ రొట్టేలను గోధుమలతో చేసిన మరే ఆహారాలను గానీ తినకూడదు. ఎందుకంటే ఇవి అంత సులువుగా జీర్ణం కావు. ముఖ్యంగా రాత్రిపూట గోధుమలు తింటే విషతుల్యం అవుతుంది. ఇది జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

salad

సలాడ్లు

సలాడ్లు బరువు తగ్గడానికే కాదు.. ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు సలాడ్లను తీసుకోవాలని చెబుతుంటారు. అయితే సలాడ్లను రాత్రిపూట మాత్రం తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే ముడి కూరగాయలు జలుబు సమస్యను పెంచుతాయి. వాతం కి కూడా దారితీస్తుంది.
 

స్వీట్లు 

భోజనం తర్వాత ఖచ్చితంగా స్వీట్లను తినే అలవాటు చాలా మందికి  ఉంటుంది. ఇలాంటి వారు భోజనం చేసిన తర్వాత స్వీట్లు లేదా చాక్లెట్లను తింటుంటారు. కానీ తీపి పదార్థం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది అంత సులువుగా అరగదు. దీనివల్ల కఫం సమస్య పెరుగుతుంది. అందుకే రాత్రిపూట ఎట్టిపరిస్థితిలో స్వీట్లను తినకండి. 
 

ఉప్పు

ఉప్పు మన శరీరానికే అవసరం. ఉప్పుతోనే కూరలు రుచిగా అవుతాయి. కానీ రాత్రిపూట ఉప్పును తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

click me!