Diabetes: మధుమేహులు ఈ ఆకుకూరను ఖచ్చితంగా తినాలి.. ఇది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది..

Published : Jun 16, 2022, 11:42 AM ISTUpdated : Jun 16, 2022, 11:44 AM IST

Diabetes: డయాబెటీస్ పేషెంట్లు ఆహారం విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వీరికి ఒక ఆకుపచ్చని కూర దివ్య ఔషదంలా పనిచేస్తుంది. 

PREV
18
Diabetes: మధుమేహులు ఈ ఆకుకూరను ఖచ్చితంగా తినాలి.. ఇది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది..

ప్రస్తుత కాలంలో డయాబెటీస్ (Diabetes) సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. ముఖ్యంగా మన దేశంలో మధుమేహ వ్యాధి గ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. లక్షల్లో రోగులున్నారు. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు జీవితాంతం ఇది  మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులోనూ చిన్నవయసు వారు సైతం ఈ రోగం బారిన పడుతున్నారు. వీరి శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగితే ఒక్కోసారి ప్రాణాల మీదికి వస్తుంది. అంతేకాదు ఈ మధుమేహం ఎన్నో రోగాలకు దారితీస్తుంది. 
 

28
diabetes

ముఖ్యంగా డయాబెటీస్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఆరోగ్యకరమైంది, ఏది కాదు అన్న విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. అప్పుడే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ (Blood sugar levels) నియంత్రణలో ఉంటాయి.  

38

మధుమేహులకు మెంతి ఆకులు (Fenugreek leaves) ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్లు (Proteins), సహజ కొవ్వు (Natural fat), కార్బోహైడ్రేట్లు (Carbohydrates), పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ సి, సోడియం, నియాసిన్, జింక్, రిబోఫ్లేవిన్, విటమిన్ ఎ, విటమినన్ కె, విటమిని్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, సెలీనయం, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 

48

మెంతు ఆకులు మధుమేహులకు ఏ విధంగా మేలు చేస్తుంది: 

మెంతి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్లస్ నియంత్రణలో ఉంటాయి. 
 

58

మెంతుల ఆకుల్లో  కరిగే ఫైబర్ ఉండటం వల్ల చక్కెర శోషన ప్రక్రియిను నెమ్మదవుతుంది. 

మెంతి ఆకులు మంచి మసాలా దినుసులా కూడా ఉపయోగపడుతుంది. దీని ఆకులను రోజూ తిన్నా ఆరోగ్యం బాగుంటుంది. 
 

68

మెంతి ఆకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (Bad cholesterol)ఇట్టే కరిగిపోతుంది. అంతేకాదు మెంతి ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి సోకే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

78

మెంతి ఆకులు గుండె ఆరోగ్యానికి (heart health)కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.  ఇవి గుండెకు దివ్య ఔషదంలా పనిచేసి.. గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. 

88

ఇకపోతే మెంతి ఆకులతో పాటుగా మెంతి గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతి వాటర్ వాటర్ ను ఉదయం పరిగడుపున తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories