షుగర్ పేషెంట్లు బెల్లాన్నితినకూడదా?

First Published Jan 20, 2023, 3:59 PM IST

మధుమేహులకు చక్కెర మంచిది కాదని చాలా మందికి తెలుసు. కానీ బెల్లాన్ని తినొచ్చని భావిస్తుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లకు బెల్లం కూడా మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎలా అంటే..? 
 

 ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అయితే షుగర్ పేషెంట్లు స్వీట్లను మొత్తమే తినకూడదు. ఎందుకంటే ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. ఎందుకంటే స్వీట్లను శుద్ధి చేసిన చక్కెరతో తయారుచేస్తారు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. అయితే మధుమేహులు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినొచ్చని చాలా మంది అంటుంటారు. ఎందుకంటే బెల్లాన్ని శుద్ధి చేయరు. ఇది శుద్ధి చేసిన చక్కెర కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. 

jaggery

బెల్లం ప్రయోజనాలు

చక్కెరతో పోల్చితే బెల్లమే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది.  దీనిని తినడం వల్ల మన శరీరంలో ఐరన్ లోపం పోతుంది. అలాగే బెల్లం రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది కూడా. అందుకే  భోజనం చేసిన తర్వాత బెల్లాన్ని ఖచ్చితంగా తినాలని మన పెద్దలు చెప్తుంటారు. అయినప్పటికీ.. మధుమేహులకు బెల్లం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు తినాలని డాక్టర్లు సూచించరు.
 

jaggery

బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా? 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెల్లాన్ని తీసుకుంటే కూడా మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ధిక గ్లైసెమిక్ సూచిక కారణంగా బెల్లాన్ని మధుమేహులు తినకూడదని సలహానిస్తుంటారు.  ఇది శుద్ధి చేసిన చక్కెర, గ్లూకోజ్ మాదిరిగా ఎక్కువగా లేనప్పటికీ.. మధుమేహులు దీన్ని తినకపోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీన్ని రక్తప్రవాహం త్వరగా గ్రహిస్తుంది. 

చక్కెరకు బెల్లం ఎందుకు ఉత్తమ ప్రత్యమ్నాయం కాదు? 

 బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహులు తమ ఆహారంలో బెల్లాన్ని చేర్చుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటీస్ పేషెంట్లు సాధారణంగా తీపి పదార్థాలను తినడం మానుకోవాలి. ముఖ్యంగా చక్కెర ప్రత్యామ్నాయాలతో తయారుచేసిన వాటిని కూడా తినకూడదు. ఎందుకంటే రక్తంలో చక్కెర  స్థాయిలను నియంత్రించడానికి ఎలాంటి స్వీట్లను తినకూడదు. 
 

బెల్లం కూడా చక్కెరలాగే హానికలిస్తుందా? 

బెల్లం, చక్కెరలను తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలను కొద్దిగా ప్రభావం పడుతుంది. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరగవని చాలా మంది నమ్ముతారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది. దీన్ని మన శరీరం గ్రహించినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది ఇతర చక్కెరల మాదిరిగానే ప్రమాదకరమైనది నిపుణులు చెబుతున్నారు. 

ఫైనల్ గా.. 

డయాబెటీస్ లేని వారు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ఇది మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే డయాబెటీస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు. అందుకే మధుమేహులు బెల్లాన్ని తీసుకోకూడదు. 

click me!