మీ దంతాలపై తెల్లని మచ్చలున్నాయా? వీటిని ఎలా పోగొట్టాలంటే..?

First Published Jan 1, 2023, 4:55 PM IST

కొంతమందికి దంతాలపై తెల్లని మచ్చలు వస్తుంటాయి. అయితే వీటిని వదలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దీనికంటే ముందు అసలు ఈ మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వీటిని వదిలించుకోవడం సులువు అవుతుంది. 

తలతల మెరిసే దంతాలను కోరుకోని వారుండరు. కానీ దంతాల సంరక్షణ సరిగ్గా లేకపోవడం, ఇతర కారణాల వల్ల కొంతమంది దంతాలపై మచ్చలు అవుతుంటాయి. ఇతర దంత సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చాలా మంది దంతాలపై తెల్ల మచ్చలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ముత్యాళ్లాంటి దంతాలపై తెల్లని మచ్చలు దంతాల అందాన్ని మొత్తం దెబ్బతీస్తాయి. చాలా మంది దీనిని కేవలం సౌందర్య సమస్యగానే భావిస్తారు. నిజానికి ఇవి దంత క్షయానికి కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ మచ్చలను ఖచ్చితంగా వదిలించుకోవాలి. అయితే దంతాలపై  ఈ మచ్చలు దంతాలు కుళ్ళిపోవడాన్ని సూచిస్తాయి. అలసు తెల్లని మచ్చలు ఎందుకు వస్తాయి? వాటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

పొడిబారిన నోరు-

నోరు ఎప్పుడూ తడిగా ఉండాలంటారు ఆరోగ్య నిపుణులు. ఒకవేళ మన నోరు పొడిగా ఉంటే.. నోట్లో పిహెచ్ ను సమతుల్యంగా ఉంచడానికి తగినంత లాలాజలం ఉత్పత్తి కాదు. దీనివల్ల పీహెచ్ స్థాయి సరిగా  ఉండదు. దీనివల్ల నోట్లో సూక్ష్మ జీవులు బాగా అభివృద్ధి చెందుతాయి. ఇవి మీ దంతాలపై దాడిచేస్తాయి. దీనివల్ల కూడా దంతాలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. 
 

ఆమ్ల ఆహారాలను తీసుకోవడం

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అలాగే సున్నితమైన కేకులు, నిమ్మకాయ, వెనిగర్ తో చేసిన ఆహారాల్లో ఆమ్లం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల దంతాలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. 

పేలవమైన నోటి పరిశుభ్రత

శరీర పరిశుభ్రత ఎంత ముఖ్యమో.. నోటిని పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. నోటిని సరిగ్గా క్లీన్ చేయకపోతే మీ దంతాలపై ఫలకం ఏర్పడుతుంది. ఫలకంలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది పిండి పదార్థాలు తిన్న వెంటనే దంతాలపై పేరుకుపోతుంది. దీనివల్ల సూక్ష్మజీవులు మన దంతాలపై దాడిచేసి తెల్లని మచ్చలను ఏర్పరుస్తాయి.

ఫ్లోరోసిస్ లేదా అధిక ఫ్లోరైడ్ 

దంతాలను స్థిరంగా ఉంచడానికి కీలకమైన ఖనిజాలలో ఫ్లోరైడ్ ఒకటి. అయితే ఈ ఫ్లోరైట్ ఎక్కువైతే దంతాలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. అలాగే దంత కుహరాల సమస్య తలెత్తుతుంది. ఫ్లోరోసిస్ వల్ల దంతాలు కొద్దిగా రంగు మారినట్టుగా కనిపిస్తాయి. అంటే పసుపు రంగు, దంతాల రంగు మారుతుంది. 
 

నివారణలు మార్గాలు

ఎనామెల్ మైక్రోఅబ్రేషన్
టీత్ వైటెనింగ్  లేదా బ్లీచింగ్
టీత్ వెనీర్
టోపికల్  ఫ్లోరైడ్
కాంపోసిట్ రెసిన్
 

పాటించాల్సిన కొన్ని నివారణ చిట్కాలు

ఫ్లోరైడ్ లేని నీటిని ఉపయోగించండి

టూత్ పేస్ట్ ను మరీ ఎక్కువగా ఉపయోగించకండి. 

బావి నీటిని పరీక్షించండి

చక్కెర, ఆమ్ల ఆహారాలను, పానీయాలను తగ్గించండి

దంతవైద్యుడిని సంప్రదించండి

నివారణ చిట్కాలను పాటించడమే కాదు మీ నోటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీటి ద్వారే ముత్యాల్లాంటి దంతాలు మీ సొంతం అవుతాయి. 

click me!