ముందుగా కొబ్బరి బొండాల్లోని లేత మీగడను లేదా కొబ్బరిని విడిగా తీసుకోండి. చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇందులో సగం ముక్కలను మిక్సీలో వేసి, కొద్దిగా కొబ్బరి నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి. మిగిలిన మీగడను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల హల్వాలో మీగడ సాఫ్ట్‌నెస్‌తో పాటు చిన్న ముక్కలు కూడా తగులుతూ భలే రుచిగా ఉంటుంది.
4. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకోండి. అందులో కొబ్బరి నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి.
5. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, చక్కెరతో పాటు కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయండి. చక్కెర కరిగాక, రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని నెమ్మదిగా పోయండి.
6. ఈ దశలో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. మిశ్రమం చిక్కబడటం మొదలవ్వగానే, రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మీగడ పేస్ట్‌ను వేసి బాగా కలపండి.
7. ఇప్పుడు స్టవ్‌ను మీడియం మంట మీద పెట్టి మిశ్రమాన్ని కంటిన్యూగా కలపండి. నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూనే ఉండాలి.
8. తర్వాత యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేయండి. మిగిలిన కొబ్బరి మీగడ ముక్కలను కూడా వేసి నెమ్మదిగా కలపండి.
9. మిశ్రమం గిన్నె అంచులకు అంటుకోకుండా దగ్గరపడుతున్నప్పుడు హల్వా పదం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే హల్వా బాగా గట్టిపడిపోతుంది. కాబట్టి, సాఫ్ట్ పదం రాగానే స్టవ్ ఆపేయండి.
10. ఒక చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పును దోరగా వేయించుకోండి. రెడీ చేసిన హల్వాలో దీన్ని వేసి కలపండి. తర్వాత నెయ్యి రాసిన ప్లేట్‌లో హల్వాను పోసి సమానంగా పరచండి.
11. కాస్త చల్లారాక ముక్కలుగా కోసి సర్వ్ చేయొచ్చు. సాఫ్ట్ కొబ్బరి మీగడ రుచి, నెయ్యి, యాలకుల సువాసన కలిసి ఈ హల్వాకు వెరైటీ టేస్ట్‌ను ఇస్తాయి.