రాత్రి పూట ఈ ఆహారాలతో.. ఈజీగా బరువు తగ్గొచ్చు..

First Published Aug 2, 2021, 12:30 PM IST

బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారుతున్నా.. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. ఇది చాలా తేలికగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట తక్కువగా, తేలికైన ఆహారం తినడం వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.

ఆరోగ్యకరమైన జీవనశైలికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. అలాగే చాలా మంది అనుకున్నట్టుగా ఆరోగ్యకరమైన ఆహారం కోసం ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. దీనికోసం మీ జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
undefined
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారుతున్నా.. రాత్రిపూట తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. ఇది చాలా తేలికగా ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట తక్కువగా, తేలికైన ఆహారం తినడం వల్ల తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.
undefined
దీనికోసం రాత్రి భోజనంలో కూరగాయలు, మసాలాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేల చూసుకుంటే రుచి బాగుంటుంది. ఇవి మీ ఆహారాన్ని మరింత పోషకమైనదిగా చేస్తాయి. అలాంటి కొన్ని ఫుడ్స్ ఇవి.
undefined
మిల్లెట్ బౌల్స్ : ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన మిల్లెట్ బౌల్ రాత్రి పూట తినడానికి చక్కటి ఆహారం. మిల్లెట్స్ లో గ్లూటెన్ ఉండదు పోషకాలు అధికంగా ఉంటాయి. మీ బరువు తగ్గడానికి ఉపయోగపడతే అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారం. సామలు, బుక్వీట్, జొన్నలు, సజ్జలులాంటి కొన్ని రకాల తృణ ధాన్యాలతో వీటిని సులభంగా తయారు చేయవచ్చు.
undefined
దీనికి కూరగాయలు కూడా కలపొచ్చు. తో మిల్లెట్లలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ కంటెంట్ అధికంగా ఉంటాయి. అంతేకాదు ఈజీగా జీర్ణమవుతుంది. శరీరంలో తొందరగా శోషించబడుతుంది. వీటికి రుచిని పెంచడానికి పాలకూర, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు జోడించండి.
undefined
వెజిటెబుల్ సూప్ : నైట్ డిన్నర్ కోసం ఆరోగ్యకరమై ఆహారంలో వెజిటెబుల్ సూప్ ను మించిన ఆహారం మరొకటి ఉండదు. ఈ వెజిటెబుల్ సూప్ సంతృప్తికరంగా ఉంటుంది, సులభంగా జీర్ణమవుతుంది. శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన అన్ని అత్యవసరపోషకాలను అందిస్తుంది. దీంట్లో మీరు టమోటా, కూరగాయలు, పాలకూర లేదా పుట్టగొడుగులు వేయచ్చు. లేకపోతే అందుబాటులో ఉన్న సీజనల్ కూరగాయలతో కూడా ప్రయోగాలు చేయవచ్చు. అయితే దీంట్లో క్రీమ్ లు, ఫ్యాటీ సూప్ లు చేరకుండా జాగ్రత్త పడండి.

డిన్నర్ సలాడ్ : సలాడ్‌లు కేవలం ఉదయం పూట టిఫిన్ గానో.. లేదా మధ్యాహ్నం భోజనంలోనో మాత్రమే తినాలని ఎవరన్నారు. మీరు అందరితో కలిసి భోంజేసే మూడ్ లేనట్టైతే సలాడ్ ఒక గొప్ప డిన్నర్ టైమ్ ఆప్షన్. అయితే ఈ సలాడ్ రెడీ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
undefined
సలాడ్ అనగానే ఏవో కొన్ని కూరగాయలు వేసేయడం కాదు, ఆరోగ్యకరమైన, పోషకలు సమృద్ధిగా ఉన్న వాటిని ఎంచుకుని తయారు చేయాలి. దీనికోసం మీ సలాడ్ లో కూరగాయలు, ఆకు కూరలు, నట్స్ ను కలపాలి. దీనిమీద డ్రెస్సింగ్ కోసం కొద్దిగా నిమ్మ, ఆలివ్ ఆయిల్, మసాలాలు వేసి బాగా కలపాలి. అంతే సూపర్ టేస్టీ సలాడ్ బౌల్ సిద్ధం. హెల్తీ ఫుడ్ కోసం పైన క్రీమ్ వేయడం లాంటివాటికి దూరంగా ఉంటే సరి.
undefined
ఓట్స్ ఇడ్లీలు : దక్షిణ భారతదేశ రుచికరమైన ఆహారం ఇడ్లీ. రాత్రి భోజనం కోసం ఇది కూడా మంచి ఎంపిక. సాంప్రదాయ ఇడ్లీలు బియ్యం లేదా రవ్వతో తయారు చేస్తారు. అయితే మీరు దీన్ని మరింత ఆరోగ్యకరంగా చేయాలనుకుంటే ఓట్స్ తో ప్రయత్నించండి. ఓట్స్‌లో ఫైబర్, అవసరమైన సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా సహాయపడుతుంది. కడుపు ఖాళీగా ఉండే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ఇడ్లీలను సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో తినొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం అనుకుంటే మీరు రాత్రి భోజనానికి 2 ఇడ్లీలు సరిపోతాయి.
undefined
కిచిడీ : ప్రాచీన భారతీయ రుచికరమైన వంటకం ఖిచ్డి. ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూస్తుంటే కిచిడీ మంచి ఎంపిక. కిచిడీ గురించి గొప్ప విషయం ఏమిటంటే, ఇది బోర్ కొట్టదు. కిచిడీలో ఒకే రకమైన పప్పు కాకుండా.. ఏదైనా ట్రై చేయచ్చు. లేదా సాబుదాన కిచిడిని కూడా ప్రయత్నించవచ్చు. క్యారట్లు, బఠానీలు,ఉల్లిపాయలు లాంటి కొన్ని కూరగాయలను కలపడం ద్వారా దీన్ని మరింత ఆరోగ్యంగా చేయవచ్చు. కిచిడీ సులభంగా జీర్ణమవుతుంది. చాలా ఆరోగ్యకరమైనది.
undefined
click me!