ప్రేమలో ఉన్నప్పుడు.. ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఒక్కసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం చాలా మంది భార్యలను పట్టించుకోరు. అదేంటో.. ప్రేయసిని ఇంప్రెస్ చేయడం బాగా తెలిసిన వారైనా సరే... భార్యల విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోతుంటారు. అయితే.. ఈ సింపుల్ ట్రిక్స్ తో.. భార్యను చాలా సులభంగా ఇంప్రెస్ చేయవచ్చట. అదెలాగో చూద్దాం..
Couples Lovers Relationship
చాలా మంది ఇళ్లల్లో ప్రతిరోజూ భార్యలే వంట చేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి.. వంట చేసి.. భర్త, పిల్లలకు వండించి.. ఇలా రకరకాల పనులు చేస్తుంటారు. అలా కాకుండా.. ఆమెకన్నా ఒక్కరోజు ముందు లేచి.. ఆమె లేచే సమయానికి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి.. బెడ్ దగ్గరకు అందించాలి. ఇలా చేస్తే.. ఆమె ఫిదా అయిపోవడం ఖాయం.
ఇక గ్రాసెరీ షాపింగ్ కూడా.. ఖచ్చితంగా మహిళలే చేయాలి అని చాలా మంది అనుకుంటారు. దానికి భిన్నంగా.. మీ భార్య బదులు మీరే ఆ సహాయం చేసి పెట్టండి. వాళ్లు ఇంప్రెస్ అయిపోతారు.
కాంప్లిమెంట్స్ నచ్చని అమ్మాయి అంటూ ఎవరూ ఉండరు. మీరు కనుక.. మీ భార్య అందంగా ఉందని.. వంట బాగా చేశావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తే.. వాళ్లు మీకు దాసోహం అయిపోతారు.
compliment
సోషల్ మీడియాలో మీ భార్య సాధించిన గొప్ప విషయాలను షేర్ చేయండి. లేదంటే.. ఆమె మీ జీవితంలోకి అడుగుపెట్టడం వల్ల మీరు ఎంత ఆనందంగా ఉన్నారనే విషయాన్ని కూడా పంచుకోండి. ఆమె చాలా ఆనందిస్తుంది.
ఏదైనా స్పెషల్ డే రోజు మాత్రమే ఐలవ్ యూ చెప్పాలని రూల్ ఏమీ లేదు. రోజుకి ఒకసారైనా ఫోన్ చేసి లేదా... మెసేజ్ చేసి.. ప్రేమగా ఐలవ్ యూ చెప్పాలి. ఈ ప్రేమను ప్రతి మహిళ కోరుకుంటుంది.
అందరి ముందు కూడా మీరు మీ భార్యపై ప్రేమను చూపించాలి. అంటే... బయటకు వెళ్లినప్పుడు చేతులు పట్టుకొని నడవడం లాంటివి చేయాలి.
బహుమతి ఎలాంటివారినైనా ఆనందంలో ముంచెత్తుంది. కాబట్టి... మీ భార్యకు నచ్చిన బహుమతిని ఇచ్చి ఆనందపరచండి.
Falling in Love
బెడ్ మీద దూకుడుగా కాకుండా.. రొమాంటిక్ గా వ్యవహరించాలి. ఆమెను సున్నితంగా చేతి వేళ్లతో తాకుతూ ఆమెను రొమాంటిక్ మూడ్ లోకి దింపాలి.
Feelfree-Sex Mood