Tea Side Effects: మీకు తెలుసా.. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే ఎంత ప్రమాదమో..

Published : Feb 01, 2022, 10:47 AM IST

Tea Side Effects: చాయ్ అంటే ఇష్టముండని వారు ఎవరూ ఉండరేమో.. అందుకే పొద్దు పొద్దున్నే టీతో గొంతు తడుపుకుని తమ రోజూ వారి పనులను మొదలు పెడుతుంటారు. టీ తాగడం వల్ల రోజంగా ఉత్సాహంగా ఉంటుంది. అయితే ఉదయం పూట టీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో మీకు తెలుసా.. 

PREV
15
Tea Side Effects: మీకు తెలుసా.. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే ఎంత ప్రమాదమో..

Tea Side Effects: కాఫీని ఇష్టపడే వారి కంటే చాయ్ నే అమితంగా ఇష్టపడే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. అందుకే చాయ్ ప్రియుల కోసం రకరకాల ఫ్లేవర్లలో టీ లభిస్తూ ఉంటుంది. చాయ్ తోనే చాలా మంది తమ రోజును ప్రారంభిస్తుంటాయి. చాయ్ చుక్క గొంతులో పొయ్యనిదే.. ఇతర పనులను అస్సలు ముట్టుకోని వారున్నారు. ఉదయం.. సాయంత్రం అంటూ తేడా లేకుండా కప్పుల మీద కప్పుల టీని లాగించేస్తుంటారు. అందులోనూ గ్రామాలు, పట్టణాలు అంటూ తేడా లేకుండా చాలా మంది టీకి బాగా అలవాటు పడిపోయారు.

25

టీ తాగడం వల్ల ఆ రోజు ఉత్సాహంగా మొదలవడమే కాదు.. ఎలాంటి అలసట లేకుండా పనిచేయగలుగుతామని చెప్పుకునే వారిని మనం చూస్తూనే ఉంటాయి. అలాంటి వారు పనిలో కాస్త బ్రేక్ దొరికితే చాలు.. టీ తాగుతుంటారు. అయితే టీ ఇతర సమయాల్లో కంటే ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిగడుపున టీ తాగడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

35

నిజానికి ఉదయం పూట టీ తాగితే ఉత్సాహం ఉంటుందనేది పూర్తిగా అవాస్తవం. అది కేవలం వారి భ్రమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ఉదయం పూట టీ తాగడం ఎలాంటి ఉత్సాహం రాదు సరికదా.. ఆ రోజంతా ఎంతో అలసటగా అనిపిస్తుంది. ఇంతేకాదు చికాకు, మానసిక ఒత్తిడి కూడా పెరుగుతాయి. 
 

45

ముఖ్యంగా మార్నింగ్ సమయంలో ఖాళీ కడుపుతో చాయ్ తాగితే వికారంగా కూడా అనిపిస్తుంది. అంతేకాదు నరాలకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిగడుపున టీ తాగితే మన పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. తద్వారా జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. కాబట్టి ఉదయాన్నే టీ తాగే అలవాటుంటే వెంటనే మానుకోవడం మంచిది. లేదంటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

55


మార్నింగ్ చాయ్ తాగితే  Urine infection అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మనం రాత్రి పడుకున్నప్పటి నుంచి మన శరీరానికి నీరు అందకపోవడంలో Dehydration సమస్య కూడా వస్తుందని పేర్కొంటున్నారు. ఇవేకావు.. ఖాళీ కడుపుతో చాయ్ తాగితే నోటి నుంచి దుర్వాస రావడమే కాదు ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఉదయం పూట అస్సలు టీ జోలికి వెల్లకండి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. 


 

Read more Photos on
click me!

Recommended Stories