కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వ్యాయామాలకు దూరమయ్యారు. అంతకముందు రోజూ వెళ్లే జిమ్‌లు మూతపడిపోయాయి. దీంతో, చాలా మంది ఫిట్‌గా ,యాక్టివ్‌గా ఉండటానికి రన్నింగ్ మీద దృష్టి పెట్టారు.
28
exercise
రన్నింగ్ చేయడానికి మనకు ప్రత్యేకంగా ఎలాంటి పరికరాలు అవసరం లేదు. సామాజిక దూరం పాటిస్తూ.. మనకు మనంగా రన్నింగ్ చేసుకొని.. ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. రన్నింగ్ మంచి కార్డియో వ్యాయామం గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
38
రోజూ ఒక మోస్తరు వేగంతో 30 నిమిషాల రన్నింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. అయితే.. ఈ రన్నింగ్ చేసేటప్పుడు మనం శ్వాస మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి. మనం శ్వాస ఎలా తీసుకుంటున్నామనే విషయం పైనే.. మనం ఎంత పరిగెడుతున్నామనేది ఆధారపడుతుంది. అదే.. చివరకు మనం శీరరంలో క్యాలరీలు కరిగేలా చేస్తుంది.
48
ఏదైనా వ్యాయామాలు చేసేటప్పుడు మనలో చాలా మందికి శ్వాసను బిగపడతారు. ఇలా చేయడం వల్ల మీ రక్తపోటు పెరుగుతుంది, మైకము, వికారం లేదా గుండెపోటు కూడా సంభవించవచ్చు. సరిగ్గా శ్వాస తీసుకోవడం మీ వ్యాయామాన్ని మరింత ప్రభావవంతంగా చేస్తుంది,
58
breathing exercise
మీ హృదయనాళ వ్యవస్థను బలపరుస్తుంది. కండరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. నడుస్తున్న సందర్భంలో కూడా, సరిగ్గా శ్వాస తీసుకోవడం వేగంగా పరిగెత్తడానికి సహాయపడుతుంది, కిలోల బరువు తగ్గించుకోవడానికి లేదా మారథాన్‌కు సిద్ధం కావడానికి కేలరీలను బర్న్ చేయాలనుకునే వారికి ఇది చాలా అవసరం.
68
breathing exercise
మనం రన్నింగ్ చేసేటప్పుడు.. నడిచేటప్పుడు.. మన కాళ్ల అడుగులు ముందుకు కదిలేదానిని మనం శ్వాస తీసుకోవడాన్ని రెండు సింక్ చేయాలి. కచ్చితంగా శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఊపిరి పీలుస్తూ.. వదులుతూ రన్నింగ్ చేయాలి. ఎలా అంటే.. మన పాదాల కదలికలు.. ఊపిరి పీల్చడం, వదలడం రెండూ లయ బద్దంగా జరగాలి. ఆ సమయంలో మన వెన్ను నిటారుగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. సులభంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది
78
సాధారణంగా, మనమందరం మన ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాము. ముక్కుతో ఊపిరి తీసుకోవడం వల్ల ఆ గాలి ఊపిరితిత్తులకు చేరేలోపు గాలిని శుద్ధి చేస్తాయి. ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు మనం ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవచ్చు. అదేవిధంగా నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవచ్చు.
88
రన్నింగ్ చేసే సమయంలోనూ మీరు అనుసరించగల రెండు పద్ధతులు ఉన్నాయి. మొదట, మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి . లేదంటే.. మీ నోటి ద్వారా శ్వాస తీసుకోండి. ఎక్కువగా అలసిపోయినప్పుడు.. నోటితో శ్వాస తీసుకోవాలి. మామూలుగా అయితే.. ముక్కుతో శ్వాస తీసుకోవచ్చు. ఇది అలవాటు కావడానికి... ప్రాణయామం, కపాలాబాతి వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల.. శ్వాసను మెరుగుపరుచుకోవచ్చు.