corona virus: కొవిడ్ నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

Published : Feb 01, 2022, 09:55 AM IST

corona virus: కరోనా బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఏదో ఒక సమయంలో చాలా మంది దీని బారిన పడుతూనే ఉన్నారు. కొవిడ్ సోకినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తప్పక తీసుకుంటామో.. దీని నుంచి కోలుకున్నాక కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అంతే అవసరం.  

PREV
15
corona virus: కొవిడ్ నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

corona virus: ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ ఎంతో మందిని ప్రాణాలను తీసింది. ఇక ప్రస్తుతం థర్డ్ వేవ్, ఒమిక్రాన్ అంటూ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందులోనూ ఈ ఒమిక్రాన్ ప్రజలకు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తూ ప్రజలను మరింత ఆంధోళనకు గురిచేస్తోంది. దీని బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఈ రాకాసి ఎవరినీ వదలడం లేదు. అందుకే ఇది సోకినప్పుడు ఎన్నో జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేకాదు.. కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొన్నిజాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే దాని నుంచి శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా కోలుకోలేము. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

25

భయాలు: కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిని ఎన్నో భయాలు చుట్టుముడుతాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న భయంతో వారు ఆందోళన పడిపోతుంటారు. అలాగే కొవిడ్ సోకినప్పుడు ఎవరితోనూ కలవకపోవడం, సరిగ్గా మాట్లాడకపోవడం వంటివి చేయడం వల్ల వారు ఒంటరిగా ఫీలవుతుంటారు. అయితే  కరోనా నుంచి కోలుకున్నాకా చుట్టుపక్కల వారితో, స్నేహితులతో మాట్లాడాలని ఉన్నా.. ఏదో తప్పు చేసిన వారిలా భావిస్తూ.. ఎవరితోనూ ఫ్రీగా ఉండలేకపోతుంటారు. ఇలాంటి సమయంలోనే వారికి నిరాశ, కోపం, ఇరిటేషన్ వంటివి వస్తూ ఉంటాయి. వీటి కారణంగా నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. 
 

35


ఒత్తిడి ఎలా జయించాలి: కరోనా నుంచి కోలుకున్నాకా.. కోవిడ్ కు సంబంధించిన వార్తలను, చూడటం గానీ చదవడం గానీ చేయకండి. వాటిని చూస్తే మీలో మరింత భయం పెరిగే ప్రమాదముంది. అందుకే అలాంటి వార్తలను చూడటం తగ్గించాలి. వీలున్నప్పుుడల్లా  మీ స్నేహితులతో, బంధువులతో వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి.  కుదిరితే వ్యాయామాలను చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటుగా ఎక్కువ మొత్తంలో పోషకాలుండే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.  మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా.. వారిటి కుటుంబ సభ్యులతో చెప్పుకోవాలి. 

45

ఎలాంటి ఆహారం తీసుకోవాలి: కొవిడ్ నుంచి శారీరకంగా, మానసికంగా బయటపడాలంటే శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా కార్బొహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో లభించే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల శరీరానికి అవసరమయ్యే శక్తి లభిస్తుంది. దీనికోసం గోధుమలు, అన్నం, మొక్కజొన్న వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటితో పాటుగా మాంసం, గుడ్లు, చేపలు, చికెన్, పప్పులు, పాల ఉత్పత్తులను మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటి వల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. 
 

55

రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్: ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఖనిజాలు, విటమిన్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఐరన్ సెలినియం, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి తో పాటుగా కాపర్, జింక్ వంటివి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందుకోసం సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకోవాలి. అలాగే సిట్రస్ ఎక్కువగా లభించే కూరగాయలు, పండ్లు కూడా రోజు వారి ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. అలాగే నట్స్, డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల మీకు బలంగా తయారవుతారు.  
 

Read more Photos on
click me!

Recommended Stories