Sitting Hours: గంటల కొద్దీ కూర్చునే ఉంటున్నారా..? ప్రాణాలకే ప్రమాదం.. జాగ్రత్త

Published : Feb 18, 2022, 03:38 PM IST

Sitting Hours: గంటల కొద్ది ఒకే దగ్గర కదలకుండా కూర్చుంటున్నారా? అయితే మీకు గుండె సంబంధిత రోగాలు, రక్తపోటు సమస్య వచ్చి ప్రాణాలు పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..   

PREV
17
Sitting Hours: గంటల కొద్దీ కూర్చునే ఉంటున్నారా..? ప్రాణాలకే ప్రమాదం.. జాగ్రత్త

Sitting Hours:కరోనా రాకతో ఎంతో మంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. దీంతో వారు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ ల ముందే గంటల కొద్దీ సమయాన్ని గడుపుతున్నారు. కదలకుండా ఒకే చోట కూర్చుంటే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నాు. ముఖ్యంగా ఒకే దగ్గర గంటల కొద్దీ మకాం వేయడం వల్ల ప్రమాదరకరమైన గుండె సంబంధిత రోగాలు, అధిక రక్త పోటు వంటి రోగాలు వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. 

27

ఒకే దగ్గర కూర్చోవడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్మోకింగ్, ఊబకాయం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో.. సిట్టింగ్ వల్ల కూడా అలాంటి ప్రాణాంతక రోగాలనే ఎదుర్కోవాల్సి వస్తదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 8 గంటలు కూర్చోవడం మూలంగా అనేక సమస్యలను తప్పక ఫేస్ చేయాల్సి వస్తదని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.  
 

37

ఎక్కువ సేపు కూర్చుంటే పిరుదుల కండరాలు, కాళ్ల కండరాలు బలహీనంగా మారుతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నిలబడటానికి, నడవడానికి సహాయపడే పెద్ద కండరం బలహీనంగా మారుతుంది. దాంతో మీరు కింద పడ్డా విపరీతమైన గాయాలపాలవుతారు. అవి అంత తొందరగా మానవు. 

47

గంటలకు గంటలు కూర్చుంటే పెద్ద పేగు క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందట. అలాగే గర్భాశయం, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు కూడా అటాక్ చేస్తాయి. 

57

అంతేకాదు గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం వల్ల  Digestive system బలహీనపడుతుంది. దాంతో మీ శరీరంలో కొవ్వు పదార్థాలు, చక్కెరలు కరగకుండా నిల్వ అవుతుంటాయి. దాంతో మీరు ఊబకాయం సమస్య బారిన పడే ప్రమాదం ఉంది. అదే కూర్చున్న ప్లేస్ లో నుంచి తరచుగా లేచి అటూ ఇటూ నడుస్తూ ఉంటే మీ శరీరంలో ఉండే చక్కెరలు, కొవ్వులు ఇట్టే జీర్ణమవుతాయి. లేదంటే స్టోర్ అవుతాయి. 
 

67
work from home

గంటల తరబడి కూర్చుంటే Thigh muscles కుచించుకుపోతాయి. దాంతో మీరు జాయింట్ పెయిన్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు తెలుసా.. ఎక్కువ కూర్చుంటే.. మీరెన్ని కష్టతరమైన వ్యాయామాలు చేసినా ఎటువంటి లాభం ఉండదట. 
 

77

రోజంతా యాక్టీవ్ గా గడవాలన్నా, ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలన్నా నడక ఎంతో ముఖ్యం. కూర్చొని పనిచేసే వారైనా.. పని మధ్యలో నడవండి. ఒక ముప్పై నిమిషాలకోసారి లేచి నడుస్తూ ఉండండి. అప్పుడే మీకు బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా జరుగుతుంది. ఒకవేళ మీరు నిలబడి చేసినా నష్టమేమీ ఉండదు. దీని వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కూడా. ఇకపోతే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు లేదా టీవీ చూసున్నప్పుడు, జోలి పెడుతున్నప్పుుడో అలా అలా నడవండి. దాంతో మీరు మరింత ఆరోగ్యంగా ఉంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories