భార్యభర్తల బంధంలో ప్రేమది కీలక పాత్ర. ఆ ప్రేమ లేకుండా.. దంపతులు ఎక్కవ కాలం కలిసి ఉండలేరు. అయితే.. తమకు భార్యపై ప్రేమ తగ్గింది అనే విషయాన్ని.. చాలా మంది స్వయంగా నోరు తెరిచి చెప్పరట. కానీ వారి ప్రవర్తన ద్వారా మీరు వారికి నచ్చడం లేదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చట. మీరు మీ భర్తకు నచ్చడం లేదు అనడానికి ఈ కింద సంకేతాలే అర్థమట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
మీకు తెలీకుండానే మీ మధ్య దూరం పెరుగుతుంది. ఏదో ఒక కారణంతో.. మీరు ఓ బెడ్ మీద.. ఆయన ఓ బెడ్ మీద పడుకుంటున్నారా..? అయితే.. మీ ఇద్దరి మధ్య సమస్య ముదిరిపోయినట్లే అర్థం. ఇద్దరూ విడివిడిగా పడుకుంటున్నారు అంటే.. మిమ్మల్ని మీ భర్త దూరంపెడుతున్నారని అర్థమట.
కాబట్టి.. ఆ దూరం రాకుండా చూసుకోవాలి. ఇద్దరూ ఒకేచోట పడుకోవాలి. వివాహం తర్వాత మీరిద్దరూ విడివిడిగా పడుకోవలసిన అవసరం లేదు. పెళ్లి అంతేనే దంపతులు సన్నిహితంగా ఉండటమే.
మరో ముఖ్య విషయంలో.. భర్త మీతో పాటే గదిలో పడుకున్నప్పిటకీ.. మీ మీద అయిష్టతతో ఉండొచ్చు. అది సెక్స్ సమయంలో బయటపడుతుందట. సెక్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, కనీసం ముద్దు పెట్టడానికి కూడా విముకత తెలియజేయడం లాంటివి చేస్తున్నారు అంటే.. వారికి మీ మీద ఇష్టం తగ్గిపోయిందని అర్థం.
మీరు అతనితో సన్నిహితంగా ఉండటానికి లేదా మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించిన ప్రతిసారీ మీ భర్త మిమ్మల్ని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. అలా ప్రతిసారీ జరుగుతోంది అంటే.. మీ భర్త మిమ్మల్ని దూరం పెడుతున్నారని అర్థం. లేదంటే.. అతను మరొకరిని ఇష్టపడినప్పుడు కూడా మిమ్మల్ని దూరంపెడతారు.
మామూలుగా అయితే తమ భార్య అందంగా ఉండాలని ప్రతి భర్త కోరుకుంటారు. మీరు కూడా అంతే అందంగా ముస్తాబైనా.. లేదంటే ఏదైనా మంచి పని చేసినా అతని నుంచి ప్రశంస అందడం లేదు అంటే.. కనీసం అతను మీ పై దృష్టి పెట్టడం లేదు అని అర్థం చేసుకోవాలి. లేదంటే.. అతని మనసు మరెక్కడైనా ఉండి ఉండొచ్చు.
Image: Getty Images
ఏదైనా సంబంధంలో కమ్యూనికేషన్ అనేది కీలకమైన అంశం. విజయవంతమైన దాన్ని నిలుపుకోవడానికి, మీ అవసరాలు , కోరికలను తెలియజేయడం అవసరం. మీ భర్త అలా చేయకపోతే.. మీ పట్ల అతను ఏ మాత్రం ఆకర్షితుడై లేడు అని సంకేతమట.