Health Tips: పీరియడ్స్ టైం లో పెరుగు తినొచ్చా? లేదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

Published : Feb 18, 2022, 02:44 PM IST

Benefits Of Curd: నెలసరి సమయంలో పెరుగు తింటే సంతాన లేమి సమస్యలు, ఇంకా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తదని చాలా మంది ఆ సమయంలో పెరుగును అస్సలు తినరు. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

PREV
16
Health Tips: పీరియడ్స్ టైం లో పెరుగు తినొచ్చా? లేదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

Benefits Of Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆడవారు మాత్రం నెలసరి సమయంలో పెరుగును అస్సలు తినకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ సమయంలో చాలా మంది పెరుగుకు దూరంగా ఉంటారు. అయితే నెలసరి సమయంలో వారి హార్మోన్లలో మార్పులు వస్తాయి. దాంతో వారి గర్భాశయం వాపు రావడం, సంకోచం చెందడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య మరింత పెద్దదవుతుందని, ఫ్యూచర్ లో సంతాన లేమి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా మంది పెరుగును తినరు. మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 
 

26

నెలసరి సమయంలో పెరుగును తినకూడదనేది కేవలం మన అపోహ మాత్రమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దీనివల్ల ఆ సమస్యలు ఎక్కువ అవుతాయనే విషయంలో నిజం లేదు. నిజానికి పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల వాపు సమస్య తగ్గుతుందట. 
 

36

అంతేకాదు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలను పెరుగు తగ్గిస్తుందట. పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల బలోపేతానికి బాగా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెరుగును తినడం వల్ల నీరసం, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి.
 

46

పెరుగులో ఉండే  Good bacteria జీర్ణ సంబంధిత రోగాలు రాకుండా చేస్తుంది. అందుకే ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా పీరియడ్స సమయంలో కూడా పెరుగును తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఫ్రెష్ పెరుగును మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.
 

56

పీరియడ్స్ ఉన్నప్పుడు పెరుగును రాత్రి పూట అస్సలు తినకూడదు. ఎందుకంటే వెదర్ కూల్ గా ఉండటంతో రాత్రి పూట పెరుగు తింటే కఫం, పిత్త వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట. అందుకే తాజా పెరుగును పగటి పూట మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు.
 

66

పీరియడ్స్ సమయంలో ఆడవారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఆడవారికి పోషకాహార లోపం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయంలో వారు క్యాల్షియం, ప్రోటీన్లు, ఐరన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలనే ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా నెలసరి సమయంలో అధిక మసాలాలు ఉన్న ఆహారాలను అస్సలు తినకూడదు. టీ, కాఫీలను ఎక్కువగా తాగకూడదు. ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడమే ఉత్తమం. 
 

click me!

Recommended Stories