Curly Hair: ఈ ఒక్క హెయిర్ జెల్ చాలు.. మీ ఉంగరాల జుట్టు చిక్కులే ఉండవు, దువ్వెన పెట్టినా జారిపోతుంది

Published : Nov 14, 2026, 06:59 PM IST

Curly Hair: ఉంగరాల జుట్టు వారికి దాన్ని కాపాడుకోవడం కష్టమే. పదే పదే చిక్కులు పడుతుంది. తేమ, పొడిబారడం వల్ల కర్ల్స్ ఒక్కోలా కనిపిస్తుంటాయి. అందుకని ఈ నేచురల్ హెయిర్ జెల్ ట్రై చేయండి. జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా ఉండి, చిక్కుల్లేకుండా ఉంటుంది.

PREV
16
నేచురల్ హెయిర్ జెల్

ఉంగరాల జుట్టు ఉన్నవారికి దాన్ని కాపాడుకోవడం చాలా కష్టమే. చిక్కులు పడి చికాకు పుడుతుంది. తేమ, జుట్టు పొడిబారడం వల్ల ఒక్కోసారి కర్ల్స్ ఒక్కోలా కనిపిస్తుంటాయి. అందుకని కండిషనర్లకు బదులు ఈ నేచురల్ హెయిర్ జెల్ ట్రై చేయండి. జుట్టు పట్టుకుచ్చులా మెత్తగా ఉండి, చిక్కుల్లేకుండా ఉంటుంది.

26
ఇప్పుడంతా ఇదే ట్రై చేస్తున్నారు

అవిసె గింజలను (Flax Seeds) నీటిలో మరిగించినప్పుడు వాటి నుంచి జిగురులాంటి పదార్థం విడుదలవుతుంది. ఇందులో ఉండే మ్యూసిలేజ్ (Mucilage) అనే పదార్థం వల్ల నీరు జెల్‌లా మారుతుంది. ఈ మిశ్రమాన్ని వడకడితే హెయిర్ జెల్ రెడీ అవుతుంది. మార్కెట్లో లభించే హెయిర్ జెల్స్‌తో పోలిస్తే ఇందులో సింథటిక్ పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది దీన్ని ప్రయత్నిస్తున్నారు.

36
ఇంట్లోనే అవిసె గింజల జెల్ తయారీ విధానం

ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

- అవిసె గింజలు – పావు కప్పు

- నీళ్లు – 2 కప్పులు

- చిన్న గిన్నె

- పల్చటి వస్త్రం

- నిల్వ చేసుకోవడానికి గాజు సీసా

46
తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు, పావు కప్పు అవిసె గింజలు వేసి బాగా కలపాలి. ఈ గిన్నెను స్టవ్‌పై పెట్టి మీడియం మంటపై మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దీనివల్ల గింజలు గిన్నె అడుగున అంటుకోకుండా ఉంటాయి.

సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. ఈ సమయంలో అవిసె గింజల నుంచి జిగురులాంటి పదార్థం విడుదలవుతుంది. నీళ్లు చిక్కగా మారి నురుగు వస్తుంది. జెల్‌లా మారినప్పుడు స్టవ్ ఆపేయాలి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే పల్చటి వస్త్రంతో వడకట్టాలి. చల్లారిన తర్వాత వడకడితే జెల్ మరింత చిక్కగా మారి గింజలను వేరు చేయడం కష్టమవుతుంది. వడకట్టిన జెల్‌ను సీసాలోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. అంతే.. ఇంట్లోనే సహజమైన అవిసె గింజల హెయిర్ జెల్ రెడీ.

56
ఉంగరాల జుట్టుకు అవిసె గింజల జెల్‌తో ప్రయోజనాలు

కర్ల్స్ అందంగా కనిపిస్తాయి. ఈ జెల్‌లోని జిగురు జుట్టును ఒకచోట చేర్చి కర్ల్స్‌కు చక్కని షేప్ ఇస్తుంది. దీంతో జుట్టు మరింత అందంగా కనిపిస్తుంది. జుట్టు ఆరే సమయంలో కర్ల్స్ నీట్ గా ఉండటానికి ఈ జెల్ ఉపయోగపడుతుంది. చిన్న వెంట్రుకలను అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉండే వాతావరణంలో జుట్టును సర్దుకోవడానికి సహాయపడుతుంది. జుట్టుకు సులభంగా పట్టించుకోవచ్చు. కర్ల్స్‌ను విడదీయకుండా స్టైలింగ్ చేసుకోవడానికి వీలవుతుంది.

66
ఎలా ఉపయోగించాలి?

జుట్టు తడిగా ఉన్నప్పుడు కొద్దిగా అవిసె గింజల జెల్ తీసుకుని జుట్టు పొడవునా అప్లై చేయాలి. ముఖ్యంగా కర్ల్స్ ఉన్న భాగాల్లో చేతులతో మెల్లగా ఒత్తుతూ (Scrunching) జెల్‌ను పట్టించాలి. ఆ తర్వాత ఆరనివ్వాలి. మీ జుట్టుకు ఎంత పరిమాణం సరిపోతుందో గమనిస్తూ ఉపయోగించాలి.

Read more Photos on
click me!

Recommended Stories