Parenting: కొడుకు భవిష్యత్ కోసం ప్రతి తండ్రి వదులుకోవాల్సిన 5 అలవాట్లు ఇవే!

Published : Nov 14, 2026, 03:27 PM IST

Parenting: ప్రతి తండ్రి తన కొడుకు గొప్ప స్థాయికి ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడు. అందుకోసం నిరంతరం శ్రమిస్తాడు. అయితే కొడుకు భవిష్యత్ బాగుండాలంటే మంచి చదువు చెప్పించడమే కాదు, తండ్రి వదుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

PREV
16
కొడుకు భవిష్యత్ కోసం తండ్రి వదులుకోవాల్సిన అలవాట్లు

తండ్రి ప్రవర్తన పిల్లల వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపుతుంది. తండ్రి ఎలా మాట్లాడుతున్నాడు? తల్లితో ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఇలా చాలా విషయాలను పిల్లలు నిశితంగా గమనిస్తుంటారు. తండ్రి చేసే ప్రతి పని కొడుకుపై ఎంతో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొడుకు మంచి వ్యక్తిగా ఎదగాలని కోరుకునే ప్రతి తండ్రి ముందుగా తనలోని కొన్ని అలవాట్లను వదులుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

26
భార్యను అవమానించడం మానేయాలి

తండ్రి తన తల్లితో ఎలా ప్రవర్తిస్తున్నాడో కొడుకు చాలా నిశితంగా గమనిస్తుంటాడు. తల్లిని అందరి ముందు అవమానించడం, తక్కువ చేసి మాట్లాడటం, ఆమె అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం, చిన్నచూపు చూడటం వంటి ప్రవర్తనలు పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తండ్రి తన తల్లిని గౌరవించకపోతే, మహిళలను గౌరవించాల్సిన అవసరం లేదనే భావన కొడుకులో తెలియకుండానే ఏర్పడవచ్చు.

36
చిన్న విషయాలకే కోప్పడటం మానేయాలి

కొంతమంది తండ్రులు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా, వస్తువులు పాడుచేసినా, చెప్పిన మాట వినకపోయినా వెంటనే అరిచేయడం, తిట్టడం, కొట్టడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన వల్ల పిల్లలు తండ్రి దగ్గర తమ సమస్యలను చెప్పుకోవడానికి కూడా భయపడతారు. అంతేకాకుండా కోపం వస్తే అరవడం, ఎదుటివారిపై విరుచుకుపడటం సహజమేనని భావించే ప్రమాదం కూడా ఉంది.

46
అబద్ధాలు చెప్పడం మానేయాలి

పిల్లలకు నిజాయతీ విలువలను నేర్పించాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అబద్ధాలు చెప్పకూడదని, నిజం మాట్లాడాలని పదేపదే చెబుతుంటాడు. కానీ తండ్రి మాత్రం కొడుకు ముందే చిన్న చిన్న అబద్ధాలు చెప్తే పిల్లలు వాటిని గమనిస్తారు. మాటల్లో నిజాయతీ గురించి చెప్పి, చేతల్లో అబద్ధాలను ప్రోత్సహిస్తే పిల్లలు ఆ విలువలను నమ్మరు.

56
ఇంటి పనుల్లో సహాయం చేయకపోవడం మానేయాలి

ఇంటి పనులన్నీ భార్య బాధ్యతేనని భావించే తండ్రులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలను చూసుకోవడం వంటి పనులు కేవలం మహిళలకు సంబంధించినవని అనుకుంటారు. కానీ కుటుంబం అనేది అందరిదీ. తండ్రి ఇంటి పనుల్లో సహాయం చేయకుండా, భార్య ఒక్కరే అన్ని పనులు చేయాలని ఆశిస్తే కొడుకు కూడా అదే విధంగా ఆలోచించే అవకాశం ఉంది.

66
చెడు అలవాట్లను మానేయడం

ఆల్కహాల్, సిగరెట్ తాగడం వంటి చెడు అలవాట్లు తండ్రికి ఉంటే అవి పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొంతమంది తండ్రులు ప్రతిరోజూ తాగి ఇంటికి రావడం, కుటుంబ సభ్యులతో గొడవపడటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు మానసికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. తాగడం సాధారణ అలవాటేనని కొడుకు భావించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తండ్రి ఇలాంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories