పనీర్ ముక్కల్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ఉంచాలి. ఆ మిశ్రమంలో ఈ పనీర్ ముక్కలను వేసి పావుగంట పాటూ నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా పనీర్ లోపలి వరకు ఇంకుతుంది. మంచి రుచిని ఇస్తుంది.
ఇక క్రిస్పీగా రావడం కోసం పిండిని తయారుచేసుకోవాలి.మైదా లేదా కార్న్‌ఫ్లోర్ తో పాటూ కొద్దిగా బియ్యం పిండి, రవ్వ ఒక గిన్నెలో వేసుకోవాలి. పిండిలో కొద్దిగా గట్టి పెరుగు, ఇంగువ వేసి కలిపితే, వేయించినప్పుడు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయి.