Chicken Pakora: ఈ వానాకాలంలో క్రిస్పీ చికెన్ పకోడీ నిమిషాల్లో ఇలా చేసేయండి

Published : Jul 17, 2026, 10:42 AM IST

Chicken Pakora: వానాకాలంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే చికెన్ పకోడి చేసుకునేందుకు ప్రయత్నించండి. చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, ఎలా వండాలి వంటి పద్ధతిని ఇక్కడ స్టెప్-బై-స్టెప్ ఇచ్చాము.

PREV
13
వేడివేడిగా చికెన్ పకోడి

వేడి వేడిగా చికెన్ పకోడీ తింటే అదిరిపోతుంది. తలచుకుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ ఉల్లిపాయ పకోడీయే కాదు రుచిగా చికెన్ పకోడీ కూడా ట్రై చేయవచ్చు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే ఈ చికెన్ పకోడీ ఎవరికైనా నచ్చుతుంది. చికెన్ పకోడిని సులువుగా ఎలా చేయాలో తెలుసుకోండి.

23
చికెన్ పకోడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్ చికెన్ - అర కిలో 

శనగపిండి - ఒక కప్పు 

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను  

కారం - ఒక స్పూను 

పసుపు - అరస్పూను స

ధనియాల పొడి - అరస్పూను 

గరం మసాలా - అరస్పూను 

మిరియాల పొడి - అరస్పూను 

వాము - అర స్పూను స

ఉప్పు - రుచికి సరిపడా 

పచ్చిమిర్చి - నాలుగు 

కొత్తిమీర తరుగు - గుప్పెడు 

 నిమ్మరసం - ఒక స్పూను 

నూనె - సరిపడినంత

33
చికెన్ పకోడీ రెసిపీ
  1.  చికెన్‌ను శుభ్రంగా కడిగి  ముందుగా మారినేట్ చేయాలి. ఇందుకోసం చికెన్ ఒక గిన్నెలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
  2.   మసాలాలన్నీ చికెన్‌కు పట్టేందుకు అరగంట పాటూ మూత పెట్టి అలా వదిలేయండి. 

3.  ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, కార్న్ ఫ్లోర్, వాము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేయండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా కలపండి. 

3. ఇప్పుడు ముందుగా మారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఈ పిండిలో కూడా వేసి వాటికి పిండిగా బాగా పట్టేలా చూడాలి.  

4.  ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.  నూనె వేడెక్కా చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి.  

5. ఆ ముక్కలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి.  పకోడీలు సరిగ్గా వేగాలంటే, ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకండి.

6. ఈ చికెన్ పకోడీని పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో తింటే అదిరిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories