త్వరలోనే దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతానికి దాని ధర గురించి సమాచారం లేదు. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఈ మూడు కరోనా వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాక్సిన్ లేదా స్పుత్నిక్ వి వీటిలో ఏది ఉత్తమమైనది, ఏ వాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుందో తెలుసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యం. దేశంలోని వైద్యులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మూడు టీకాలు కరోనా లక్షణాలను నివారించడంలో అలాగే ప్రాణహాని తగ్గించడంలో 100% ప్రభావవంతంగా పనిచేస్తాయి. అయితే ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ పొందడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఆరోగ్యం, విలువైన జీవితానికి టీకా అవసరం.
కోవిషీల్డ్కోవిషీల్డ్‌ను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇంకా ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేశాయి. ఇప్పుడు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీనిని తయారుచేస్తుంది. కోవిషీల్డ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యాక్సిన్లలో ఒకటి అలాగే చాలా దేశాలు దీనిని ఉపయోగిస్తున్నాయి. కోవ్‌షీల్డ్ ఒక వైరల్ వెక్టర్ రకం టీకా. కోవిషీల్డ్ ఒక వైరస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఇది చింపాంజీలలో కనిపించే అడెనోవైరస్ ChAD0x1. కోవ్‌షీల్డ్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆమోదించింది. కోవిషీల్డ్ ట్రయల్స్ గత ఏడాది నవంబర్‌లో ముగిసింది. దీని ప్రభావం 70 శాతం ఉంటుంది. ఈ టీకా కరోనా తీవ్రమైన లక్షణాల నుండి రక్షిస్తుంది అలాగే కరోనా సోకిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.
కోవాక్సిన్కోవాక్సిన్‌ను ఐసిఎంఆర్, భారత్ బయోటెక్ తయారు చేస్తున్నాయి. దీనిని ట్రెడిషనల్ ఇన్ ఆక్టివ్ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌లో బిల్ట్ చేశారు. ఇన్ ఆక్టివ్ అంటే డెడ్ వైరస్ ని శరీరంలోకి పంపిస్తారు, ఇది యాంటీ బాడీస్ ఉత్పత్తి చేస్తుంది, అదే యాంటీబాడీ వైరస్ను చంపుతుంది. ఈ టీకా మనుషులపై చెడు ప్రభావాన్ని చూపదు. దీనికి బదులు నిజమైన వైరస్ను గుర్తించడానికి రోగనిరోధక శక్తిని సిద్ధం చేస్తుంది అలాగే దానిని చంపేస్తుంది. ఈ వ్యాక్సిన్ మనుషులపై కాకుండా కరోనా వైరస్ పై ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. కోవాక్సిన్ వైరస్ పై 78% ప్రభావం చూపిస్తుంది . ఈ టీకా వల్ల కరోనా వ్యాప్తి, మరణాల ప్రమాదాన్ని 100 శాతం తగ్గించవచ్చని ఒక పరిశోధన పేర్కొంది. కరోనా వైరస్ లాంటి వాటికి వ్యతిరేకంగా కోవాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుందని ఇటీవలి పరిశోధనలు పేర్కొన్నాయి.
స్పుత్నిక్ విస్పుత్నిక్ వి కూడా వైరల్ వెక్టర్ టీకా. కానీ దీనికి అలాగే కోవిషీల్డ్ మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటంటే కోవిషీల్డ్ ఒక వైరస్‌తో తయారావుతుంది, అయితే దీనిలో రెండు వైరస్లు ఉన్నాయి. అవి వేర్వేరు మోతాదులను కలిగి ఉన్నాయి. స్పుత్నిక్ వి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్‌గా పరిగణించబడింది. ఈ స్థాయిలో భారతదేశం అత్యంత ప్రభావవంతమైన టీకా. స్పుత్నిక్ వి 91.6 శాతం ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే దీనిని అత్యంత ప్రభావవంతమైన టీకా అని పిలుస్తారు. ఇది అడెనోవైరస్ 26 (Ad26) ఇంకా అడెనోవైరస్ 5 (Ad5) పై ఆధారపడుతుంది. టీకా శరీరానికి చేరిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ ఆక్టివ్ అవుతుంది. అలాగే శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి.
మూడు వ్యాక్సిన్ల దుష్ప్రభావాలుఈ వ్యాక్సిన్ల దుష్ప్రభావాలకు సంబంధించినంత వరకు ఈ మూడింటి దుష్ప్రభావాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ వ్యాక్సిన్లలో ఏదైనా తీసుకున్న తరువాత, తేలికపాటి జ్వరం, జలుబు, శరీర నొప్పులు వంటివి ఉండవచ్చు లేదా ఒకోసారి ఉండకపోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత కనీసం రెండు రోజులు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఇది జ్వరం మరియు జలుబు యొక్క అవకాశాన్ని తగ్గిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి సలహా తీసుకోని తదనుగుణంగా మందులు తీసుకోండి.