ఎడు ఎకరాల్లో ధోనీ లగ్జరీ హౌస్.. ఎప్పుడైనా చూశారా..?

First Published May 5, 2021, 1:44 PM IST

ధోనీకి రాంచీలో బ్యూటీఫుల్ హౌస్ ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. దానిని ఏడు ఎకరాల్లో నిర్మించాడు తెలుసా. ఆ బ్యూటిఫుల్, లగ్జరీ హౌస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, కెప్టెన్ కూల్.. ఇలా ఏ పేరుతో పిలిచినా.. వెంటనే గుర్తుకు వచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. నిన్నటి వరకు ఐపీఎల్ మ్యాచుల్లో ధోనీ అదరగొట్టాడు. పలువురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడంతో... ఐపీఎల్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆటగాళ్లంతా తమ ఇళ్లకు చేరిపోయారు.
undefined
కాగా... ధోనీకి రాంచీలో బ్యూటీఫుల్ హౌస్ ఉందనే విషయం అభిమానులకు తెలిసే ఉంటుంది. దానిని ఏడు ఎకరాల్లో నిర్మించాడు తెలుసా. ఆ బ్యూటిఫుల్, లగ్జరీ హౌస్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా...
undefined
ధోనీ తన ఇంటికి కైలాష్ పతి ఫామ్ హౌస్ అని పేరు పెట్టుకున్నాడు. ఈ ఇంటిని ఏడు ఎకరాల్లో నిర్మించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాలనికి సమీపంలోనే ధోనీ ఇల్లు ఉంటుంది. ఈ ల్యాండ్ 2009లో ధోనీ కి బహుమతిగా వచ్చింది. అందులోనే ధోనీ ఇల్లు నిర్మించుకున్నారు. 2017లో ఈ ఇంట్లోకి ధోనీ తన కుటుంబంతో కలిసి షిఫ్ట్ అయ్యారు.
undefined
ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఆయన తన జీవితాన్ని కూడా ఒక రాజులాగా గడుపుతారని అభిమానులు అంటూ ఉంటారు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుందట. చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుందట.
undefined
కాగా.. ఈ ఇంటికి సంబంధించిన వీడియో ఇటీవల ధోనీ భార్య సాక్షి ధోనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో కుక్క, గుర్రం కూడా ఉన్నాయి.
undefined
సాక్షి, ధోనీ ఇద్దరికీ పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. అందుకే వారి ఇంట్లో దాదాపు ఆరు కుక్కలు ఉంటాయి. వాటి పేర్లు లేహ్, జోయా, జరా, సామ్, గబ్బర్, లిల్లీ. వీటికి సంబంధించిన ఫోటోలను సాక్షి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ పెట్ డాగ్స్ తో వారి కుమార్తె జీవా ఆడుకుంటూ ఉంటారు.
undefined
ధోనీ ఇంటి ప్రాంగణం మొత్తం ఆకుపచ్చని వాతావరణ స్పష్టంగా కనపడుతుంది. ఆ గార్డెన్ మొత్తం పూల మొక్కలతో చాలా అందంగా కనపడుతోంది. వివిధ రకాల చెట్లు, పూల మొక్కలతో ఆ గార్డెన్ చాలా అందంగా కనపడుతోంది.
undefined
ధోనీ ఫామ్ హౌస్ లో ఇండోర్ స్టేడియం ఉంది. అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్, నెట్ ప్రాక్టీసింగ్ గ్రౌండ్, ఆధునిక జిమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో ధోనీ ఫ్యామిలీతో ఇక్కడే ఎక్కువ కాలం గడిపారు.
undefined
ధోనీ తన చిన్నతనంలో కేవలం రెండు గదుల ఇంట్లో జీవించాడు. 2004లో ధోనీ అరంగేట్రం చేశాడు. చాలా కష్టపడుతూ జీవితాన్ని ప్రారంభించిన ధోనీ 2009లో మూడంతస్థుల ఇల్లు కొనగలిగాడు. దాదాపు 8 సంవత్సరాలు ధోనీ అక్కడే నివసించాడు.
undefined
ధోనీ మొత్తం ఆస్తుల గురించి మాట్లాడుకుంటే.. మొత్తం రూ. 775 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ధోనీ దగ్గర కార్లు, బైక్ ల కలెక్షన్ చాలా ఉంది. వాటి ఖరీదు రూ.25కోట్ల వరకు ఉండొచ్చు. ఇవి కాకుండా మరో రూ. 552కోట్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
undefined
click me!