సాధారణంగా కాంస్యం, బ్రాస్, రాగి, వెండి వంటి లోహాల పాత్రలలో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. ప్లాస్టిక్ వంటి కృత్రిమ పదార్థాలతో చేసిన పాత్రలలో నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమైన ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
25
ఏది బెటర్?
ఇలాంటి పరిస్థితుల్లో రాగి (కాపర్) లేదా గాజు సీసాల్లో ఏది మంచిదనే చర్చలో, చాలా మంది రాగిని సిఫార్సు చేస్తున్నారు. వీటిలో తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతన్నారు. మరి, రాగి లేదా గాజు సీసా.. ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
35
రాగి సీసాలో నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
నీటిలోని హానికరమైన బ్యాక్టీరియా , వైరస్‌లను నాశనం చేయడంలో సహాయపడే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కాపర్ లో ఉన్నాయి.
ఇనుమును శోషించుకోవడానికి రాగి సహాయపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ముఖ్యమైనది కాబట్టి, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా, రాగి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
రాగి ఒక ముఖ్యమైన ఖనిజం. రాగి సీసాలో నీరు తాగడం వల్ల ఈ ఖనిజం సహజ స్థాయిలను పొందవచ్చని కొందరు నమ్ముతారు.
గాజు గ్లాసులో నీరు తాగడం సురక్షితం. ఇది జడ పదార్థంగా పరిగణిస్తారు.
గాజు నీటికి అదనపు రుచి లేదా రసాయన లక్షణాలను ఇవ్వదు.
55
గాజు vs రాగి సీసా: ఏది ఉత్తమం?
మీరు రాగి సీసాలో నీరు తాగడానికి ఇష్టపడితే, దానిని మితంగా తాగండి, ఎందుకంటే దాని అధిక వినియోగం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంటే, ఇది కాలేయం, మూత్రపిండాలకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.
హానికరమైన పదార్థాలు చేరకుండా ఉండటానికి రాగి పాత్రలను సరిగ్గా శుభ్రం చేసి నిర్వహించాలి.
మీరు రాగి పాత్రల విషప్రభావం గురించి ఆందోళన చెందుతుంటే, గాజు సీసాల్లో వాటర్ తాగొచ్చు.