కూలర్, ఏసీ రెండూ చల్లని గాలి ఇస్తున్నా, వాటి విధానం పూర్తిగా వేరు. కూలర్ నీటిని ఆవిరి చేసి గాలిని చల్లబరుస్తుంది. అందుకే కూలర్‌లో నీళ్లు తగ్గిపోతుంటాయి. కానీ ఏసీ గాలిలోని తేమను తీసి చల్లదనం ఇస్తుంది. అందుకే ఏసీ నుంచి నీళ్లు బయటకు వస్తాయి. కూలర్ గాలి తడిగా ఉంటుంది, ఏసీ గాలి డ్రైగా ఉంటుంది. ఖర్చు విషయంలో కూడా కూలర్ తక్కువ, ఏసీ ఎక్కువగా ఉంటుంది.
మొత్తంగా కూలర్‌లో నీళ్లు గాలిలో కలిసిపోతాయి, అందుకే అవి తగ్గిపోతాయి. ఏసీ మాత్రం గాలిలోని తేమను నీటిగా మార్చి బయటకు పంపుతుంది. అందుకే ఏసీ నుంచి నీళ్లు వస్తాయి. ఈ చిన్న తేడా తెలుసుకుంటే మనకు ఈ రెండు పరికరాల పని విధానం చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.