Summer Sleep Tips: ఈ వేసవి రాత్రుల్లోచెమటతో, ఉక్కపోతతో నిద్రపట్టక అల్లాడుతున్నారా? గదిలో ఈ చిన్న ఛేంజేస్ చేసుకుంటే రాత్రంతా హాయిగా పడుకోవచ్చు. ఉదయం ఫ్రెష్ ఫీలింగ్‍తో ఉంటారు. ఏసీ లేకుండానే కూల్‌గా నిద్రపోవచ్చు.
సమ్మర్‍లో తల దగ్గర ఫ్యాన్ పెట్టుకుంటారు. అలా కాకుండా మీ దగ్గర టేబుల్ ఫ్యాన్ లేదా స్టాండింగ్ ఫ్యాన్ ఉంటే దాన్ని మీకు ఎదురుగా పెట్టుకోవద్దు. దానికి బదులుగా, ఫ్యాన్‌ను కిటికీ వైపు తిప్పి బయటకు గాలి వెళ్లేలా పెట్టండి. ఇది గదిలోని వేడి గాలిని బయటకు పంపి, గదిని త్వరగా కూల్ చేస్తుంది. అప్పుడు మీకు హాయిగా నిద్ర పడుతుంది.
25
బెడ్‌షీట్‌ను ఫ్రిజ్‌లో పెట్టండి
మీరు వాడే బెడ్‌షీట్, లేదా దిండు కవర్‌ను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టండి. దాన్ని నిద్రపోవడానికి 20 నిమిషాల ముందు ఫ్రీజర్‌లో ఉంచండి. పడుకునేటప్పుడు దాన్ని తీసి, పరిచి పడుకొని చూడండి... ఆ చల్లదనంతో కొన్ని గంటల పాటు హాయిగా నిద్రపోతారు. ఒకసారి ట్రై చేయండి.
35
ఈజిప్ట్ రాజుల సీక్రెట్ ఇదే
ఒక పెద్ద కాటన్ టవల్ తీసుకుని, నీటిలో తడిపి బాగా పిండండి. నీళ్లు కారకూడదు పడుకునేటప్పుడు దాన్ని మీ శరీరంపై కప్పుకోండి. గాలిలోని వేడిని ఈ తడి పీల్చుకుని, శరీరం వేడెక్కకుండా ఏసీలాంటి చల్లదనాన్ని ఇస్తుంది. దీన్నే 'ఈజిప్షియన్ మెథడ్' అని కూడా అంటారు.
నిద్రపోయే ముందు మీ మణికట్టు, కాలి చీలమండ, మెడ భాగంలో చల్లటి ఐస్ నీళ్లను రాయండి. లేదా చల్లటి తడి గుడ్డను 2 నిమిషాల పాటు అక్కడ ఉంచండి. ఈ ప్రదేశాలలో రక్తనాళాలు చర్మానికి చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి, ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత వెంటనే తగ్గి, హాయిగా నిద్రపడుతుంది.
55
సాక్స్ వేసుకుని నిద్రపోండి
వేసవిలో సాక్సులా? అని ఆశ్చర్యపోకండి. ఒక పల్చటి కాటన్ సాక్స్‌ను చల్లటి నీటిలో తడిపి, బాగా పిండి, కాళ్లకు వేసుకుని నిద్రపోండి. మన శరీర ఉష్ణోగ్రత పాదాల ద్వారానే నియంత్రిస్తుంది. పాదాలు చల్లగా ఉంటే, మెదడుకు నిద్రపోవాలనే సిగ్నల్ వెంటనే అందుతుంది.