Kitchen Hack: వంటగదిలో ఈగలతో విసిగిపోయారా? ఇవి మీ ఇంట్లో ఉంటే అస్సలు కనిపించవు

Published : May 23, 2026, 06:00 PM IST

Kitchen Hack: వంటగది ఎంత నీట్ గా ఉంచినా ఈగల సమస్య పోదు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలంలో ఎక్కువగా ఆహారంపై వాలుతుంటాయి. వంట చేసేటప్పుడు, తినేటప్పుడు వాలి చికాకు పెడుతుంటాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే కిచెన్‌ను ఈగల బెడద నుంచి కాపాడకోవచ్చు. 

PREV
15
ఆహార వ్యర్థాలను ఎక్కువ రోజులు ఉంచకండి

వంటగదిలో మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను ఎక్కువసేపు ఉంచకండి. అవి ఈగలు, పురుగులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలాగే డైనింగ్ టేబుల్‌, కౌంటర్‌టాప్‌లపై ఆహారాన్ని తెరిచి ఉంచకుండా మూత పెట్టి నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల వంటగది పరిశుభ్రంగా ఉండటమే కాకుండా బ్యాక్టీరియా వ్యాప్తి కూడా తగ్గుతుంది. 

25
ఆహార పదార్థాలు మూతపెట్టి ఉంచాలి

వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలను ఎప్పుడూ మూతపెట్టి భద్రంగా ఉంచాలి. పండ్లు, మిగిలిపోయిన కూరలు, వండిన ఆహారం వంటి వాటిని తెరిచి ఉంచితే ఈగలు, దుమ్ము చేరే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి ఆహార పదార్థాన్ని కవర్ చేసి నిల్వ చేయడం మంచిది. 

35
చెత్తబుట్టకు మూత తప్పనిసరి

వంటగదిలో ఉపయోగించే చెత్తబుట్టకు తప్పనిసరిగా మూత ఉండేలా చూసుకోవాలి. చెత్తబుట్టను తెరిచి ఉంచితే దుర్వాసనతో పాటు ఈగలు, పురుగులు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. అందుకే చెత్తను సకాలంలో బయటకు వేయడంతో పాటు బుట్టను శుభ్రంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.

45
సహజ పద్ధతులతో ఈగలను తరిమేయండి

లవంగాలు, నిమ్మకాయ, పుదీనా, తులసి వంటి సహజ పదార్థాలను వంటగదిలో ఉంచడం మంచిది. వీటి సహజ సువాసన ఈగలు, చిన్న పురుగులు దగ్గరకు రాకుండా సహాయపడుతుంది. దీంతో వంటగది తాజాగా, పరిశుభ్రంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.

55
కిటికీలకు నెట్ వాడండి

కిటికీలకు నెట్‌ అమర్చితే బయట నుంచి ఈగలు, పురుగులు ఇంట్లోకి రావడం తగ్గుతుంది. అలాగే వంటగదిలో గాలి, వెలుతురు సరిగా వచ్చేలా చూసుకుంటే తేమ, దుర్వాసనలు తగ్గి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories