మలబద్దకానికి కారణాలు
జీవనశైలిలో సమస్యలు, ఫైబర్ కంటెంట్ ను తక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, వ్యాయామం చేయకపోవడం ఈ సమస్యకు సాధారణ కారణాలు. డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులు, పార్కిన్సోనిజం, స్ట్రోక్, వెన్నుపాము సమస్యలు వంటి రోగాలు కూడా మలబద్దకానికి దారితీస్తాయి. ముఖ్యంగా యాంటాసిడ్లు, ఐరన్ సప్లిమెంట్స్, కొన్ని రకాల బీపీ మందులు, యాంటిడిప్రెసెంట్స్ వంటివి కూడా మలబద్దకానికి దారితీస్తాయి. మలబద్దకం సమస్యతో పాటుగా రక్తస్రావం, బరువు తగ్గడం లేదా పొత్తి కడుపులో గడ్డలు ఉంటే ఈ మలబద్దకం ప్రమాదకరంగా పరిగణించాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇవి పెద్దప్రేగు లేదా మల కణితులు కావొచ్చంటున్నారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు.