benefits of coffee powder: కాఫీ పౌడర్ ను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు..

First Published Jul 5, 2022, 3:53 PM IST

benefits of coffee powder: కాఫీ పౌడర్ తో కాఫీని చేసుకుని తాగడమే కాదు.. దీన్ని ఎన్నో రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లోని దోమలను తరమడం నుంచి ముఖాన్ని కాంతివంతంగా చేయడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది కాఫీ పౌడర్. 


పొద్దు పొద్దన్నే కాఫీ కప్పులో వచ్చే స్మెల్ తో కడుపు నింపుకోవచ్చు అనిపిస్తుంది కదూ.. అయినా ఈ రోజుల్లో కాఫీనీ తాగని వారు చాలా తక్కువే. పొద్దన్న ఒక కాఫీ కప్, కుదిరితే మధ్యాహ్నం, ఇక సాయంత్రమైతే పక్కాగా తాగాల్సిందే. మొత్తంగా రోజుకు రెండు కప్పుల కాఫీని తాగేవారు చాలా మందే ఉన్నారు. 

 కాఫీ మంచి వాసనను మాత్రమే కాదు రుచిగా కూడా ఉంటుంది. అందుకే కాఫీ ప్రియులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అంతేకాదు కాఫీ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

కాఫీ హెపటైటిస్, ఫ్యాటీ లివర్, లివర్ క్యాన్సర్ వంటి కాలెయ వ్యాధులను తగ్గించడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది కాలెయ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అయితే ఈ కాఫీ పౌడర్ ను కేవలం కాఫీ తయారీకే కాదు.. మరెన్నో ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. కాఫీ పౌడర్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో  ఇప్పుడు తెలుసుకుందాం.. 

కాఫీ పౌండర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మొటిమలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తాయి. రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.  

కాఫీ పౌడర్ లో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. ఇక కాఫీ పౌడర్ ఇంట్లో ఉండే దోమలను తరిమికొట్టడంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాఫీ పొడి వాసన వస్తే దోమలు ఆ చుట్టుపక్కల కూడా ఉండవు. 
 

ఫ్రిజ్ లో లేదా.. గదిలో బ్యాడ్ స్మెల్ వస్తుంటే.. అక్కడ కొద్ది సేప కాఫీ పౌడర్ ను ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆ రూమంతా కమ్మని వాసన వస్తుంది.  కాఫీ పౌడర్ ను ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగిస్తారు. కాపీ పౌడర్ ఫేస్ ప్యాక్ తో ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. 

కాఫీ స్మెల్ కు క్రిమికీటకాలు ఇంట్లో ఉండవు. దోమలు కూడా పారిపోతాయి. ఇందుకోసం కాఫీ పౌడర్ ను పొగ వేయాలి. ఈ వాసన దోమలకు నచ్చదు. దీంతో అవి ఇంట్లో నుంచి పారిపోతాయి. 

ముఖానికి కాఫీ పౌడర్ వదులుగా ఉండే చర్మాన్ని బిగుతుగా తయారుచేస్తుంది. అలాగే కంటి వాపు సమస్యను కూడా పోగొడుతుంది. ఈ పొడిని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. 
 

ఇక ఈ పొడిని పాత్రలకు పట్టిన జిడ్డు మరకలను వదిలించడానికి కూడా సహాయపడుతుంది. కాఫీ పౌడర్ ను కొద్దిగా మాంసంలో వేస్తే కూర టేస్టీగా అవుతుంది. అయితే దీనిని పరిమితిలోనే తీసుకుంటే మేలు జరుగుతుంది. లేదంటే సమస్యలు వస్తాయి. 
 

click me!