కొబ్బరి నూనెలో ఇది కలిపి పెడితే తెల్ల జుట్టు నల్లగా అవుతుంది.. జుట్టు రాలకుండా పొడుగ్గా పెరుగుతుంది

First Published | Nov 11, 2024, 12:28 PM IST

ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే జుట్టును రాలకుండా చేయడంలో కొబ్బరి నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాకపోతే దీనిలో ఒకటి కలిపి పెట్టాలి. 


ఆడవారికి మాత్రమే కాదు.. మగవారికి కూడా జుట్టు అంటే చాలా ఇష్టం. అందుకే జుట్టు హెల్తీగా ఉండేందుకు ఎన్నో రకాల నూనెలను, షాంపూలను మారుస్తుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి పల్చని జుట్టే ఉంటుంది. హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవారు చాలా మందే ఉన్నారు. 

నిజానికి జుట్టు ఊడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాలుష్యం, జీవనశైలి మారడం, చెడు ఆహారపు అలవాట్లు, జుట్టు సంరక్షణ సరిగ్గా లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల నెత్తిమీద చుండ్రు ఏర్పడటం, వెంట్రుకలు ఊడిపోవడం, జుట్టు పొడిబారడం, వెంట్రుకలు తెగిపోవడం వంటి సమస్యలు వస్తాయి.
 

hair oiling

ఇలాంటి పరిస్థితిలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీ జుట్టుకు సరైన పోషణ అవసరం. ఇందుకోసం కొబ్బరి నూనె బాగా సరిపోతుంది. నిజానికి జుట్టుకు కొబ్బరి నూనెను ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నాం. ఈ కొబ్బరి నూనె మన నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అలాగే జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. నిపుణుల ప్రకారం.. కొబ్బరి నూనెలో కొన్ని పదార్థాలను కలిపి జుట్టుకు పెడితే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే నెత్తిమీద కొత్త వెంట్రుకలు వస్తాయి. జుట్టు పొడుగ్గా కూడా పెరుగుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనెలో ఏం కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


hair oiling

కొబ్బరి నూనె, దాల్చినచెక్క హెయిర్ మాస్క్

కొంతమంది జుట్టు విపరీతంగా తెగిపోతుంటుంది. ఇలాంటి వారికి కొబ్బరి నూనె, దాల్చిన చెక్క హెయిర్ మాస్క్ బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ దాల్చిన చెక్క నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు బాగా పెరిగేలా చేయడమే కాకుండా.. బలంగా కూడా చేస్తుంది. ఒకపోతే కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టును రిపేర్ చేయడానికి సహాయపడతాయి.

ఈ హెయిర్ ప్యాక్ ను తయారుచేయడానికి కొబ్బరి నూనెలో దాల్చిన చెక్క పౌడర్ ను వేసి బాగా కలిపి జుట్టుకు పెట్టండి. తర్వాత కాసేపు జుట్టును బాగా మసాజ్ చేయండి. 30 నుంచి 45 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలను శుభ్రం చేసుకోండి. 
 

కొబ్బరి నూనె, లెమన్ హెయిర్ మాస్క్

జుట్టుకు కొబ్బరి నూనె, లెమన్ హెయిర్ మాస్క్ కూడా బాగా సహాయపడుతుంది. ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీ జుట్టు పెరగడం మొదలవుతుంది. ముఖ్యంగా జిడ్డు హెయిర్ ఉన్నవారికి ఇది బాగా సరిపోతుంది. నిమ్మరసం నెత్తిమీద చుండ్రు లేకుండా చేస్తుంది. అలాగే ఇది నెత్తిమీదున్న రంధ్రాలు తెరుచుకోవడానికి సహాయపడుతుంది. 

ఈ హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో టీస్పూన్ నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని నెత్తికి, జుట్టు మొత్తానికి అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. 

కొబ్బరినూనె, తేనె హెయిర్ ప్యాక్

కొబ్బరి నూనె, తేనె హెయిర్ ప్యాక్ జుట్టుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ హెయిర్ ఫ్యాక్ తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది. తెల్ల వెంట్రుకలు రావడాన్ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ డల్ నెస్ ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ ప్యాక్ తో నెత్తిమీద చుండ్రు లేకుండా పోతుంది. 

ఈ ప్యాక్ ను తయారుచేయడానికి ముందుగా ఒక పాన్ తీసుకుని వేడి చేసి అందులో టీ స్పూన్ తేనె, టీస్పూన్ కొబ్బరి నూనె పోయండి. దీన్ని బాగా కలిపి తక్కువ మంటపై వేడి చేయండి. కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత జుట్టుకు పెట్టండి. ఇది దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. ఇందుకోసం ఈ హెయిర్ ప్యాక్ ను జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు బాగా పెట్టాలి. ఆ తర్వాత కాసేపు మసాజ్ చేయాలి. 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. 


కొబ్బరి నూనె, గుడ్డు హెయిర్ ప్యాక్

పొడి జుట్టు ఉన్నవారికి ఈ హెయిర్ ప్యాక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. అలాగే జుట్టు రాలకుండా చేయడానికి సహాయపడుతుంది. ఈ హెయిర్ ప్యాక్ తో జుట్టుకు బలాన్నిచ్చే గుడ్డును వాడుతారు. 

అలాగే ఈ ప్యాక్ లో ఉపయోగించే పెరుగు, కొబ్బరి నూనె వంటి మాయిశ్చరైజింగ్ ఉత్పత్తులు జుట్టు డ్రై నెస్ ను నియంత్రిస్తాయి. ఈ ప్యాక్ ను తయారుచేయడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేయండి. దీంట్లోనే ఒక టీ స్పూన్ నిమ్మరసం, 1/2 కప్పు సాదా పెరుగు, ఒక గుడ్డును కొట్టి కలపండి. ఈ ప్యాక్ ను వేళ్లతో జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు పెట్టండి. ఆ తర్వాత షవర్ క్యాప్ ను పెట్టుకోండి. 20-25 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో జుట్టును వాష్ చేయండి. మీరు రెగ్యులర్ గా పెట్టే షాంపూనే వాడండి. 
 

click me!