బాస్మతి రైస్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Nov 11, 2024, 10:21 AM IST

చాలా మంది ఆడవాళ్లు ఇంట్లో బాస్మతి రైస్ ను వండుతుంటారు. కానీ దీన్ని ఎన్ని సార్లు వండినా.. పర్ఫెక్ట్ గా మాత్రం వండలేకపోతుంటారు. అయితే మీరు కొన్ని చిట్కాలను గనుక ఫాలో అయితే మాత్రం అన్నం చక్కగా ఉడుకుతుంది. రైస్ బాగా అవుతుంది.  

రోజూ తినకపోయినా బాస్మతి రైస్ ను పండుగలకు లేదా ఏదైనా స్పెషల్ సందర్భానికి ఖచ్చితంగా వండుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో చికెన్, మటన్, వెజిటేబుల్ బిర్యానీలను ట్రై చేస్తుంటారు. అయితే ఈ రైస్ ను ఎంత బాగా ప్రిపేర్ చేసినా.. ఏదో ఒక లోపం ఉంటుంది. అంటే అన్నం సరిగ్గా ఉడకకపోవడమో, లేకపోతే మెత్తగా అవ్వడమో వంటివి జరుగుతుంటాయి. దీనికి అసలు కారణం మీరు బాస్మతీ రైస్ ను సరైన పద్దతిలో వండకపోవడమే. దీనివల్ల బాస్మతి రైస్ టేస్ట్ కూడా మారుతుంది. 

చాలా మంది బాస్మతి అన్నాన్ని వండటానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మాత్రం బాస్మతి రైస్ హోటల్ స్టైల్ లో మాదిరిగా తయారుచేస్తారు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అరగంట నానబెట్టాలి

చాలా మంది బాస్మతి రైస్ ను వండటానికి వాటిని అప్పుడే కడిగేసి వండేస్తుంటారు. కానీ బాస్మతి రైస్ పర్ఫెక్ట్ గా రావాలంటే మాత్రం వీటిని అరగంటైనా నానబెట్టాలి. మీరు బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టడం వల్ల వాటిని వండేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇందుకోసం మీరు అరగంట ముందే బియ్యాన్ని నీళ్లతో రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టాలి. దీనివల్ల బాస్మతి రైస్ మొత్తం సమానంగా ఉడుకుతుంది. 
 


నీటి పరిమాణం 

బాస్మతి అన్నాన్ని వండేటప్పుడు చాలా మందికి వాటిలో నీళ్లు ఎన్ని పోయాలో సరిగ్గా తెలియదు. దీనివల్లే ఈ రైస్ సరిగ్గా కాదు. ఉదాహరణకు.. మీరు ఒక కప్పు బాస్మతి రైస్ ను వండాలనుకుంటే దానికి మీరు 1.5 నుంచి రెండు కప్పుల నీటిని ఉపయోగించాలి.

మీరు ముందే బియ్యాన్ని నీటిని నానబెట్టడం వల్ల అవి కొంతమొత్తంలో నీటిని గ్రహిస్తాయి. కాబట్టి ఇవి తొందరగా ఉడుకుతాయి. కాబట్టి మీరు వీటికి ఎక్కువ నీళ్లను పోయకూడదు. ఒకవేళ నీళ్లు సరిపోవు అనుకుంటే ఉడుకుతున్నప్పుడు కొన్ని వేడి నీళ్లను పోయండి. 
 

ముందుగా నీళ్లను మరిగించాలి

మీకు తెలుసా? అన్నాన్ని వండేటప్పుడు బియ్యం, నీళ్లను కలిపి ఎప్పుడూ ఉడికించకూడదు. అంటే ముందే మీరు నీళ్లను ఎక్కువ మంట మీద మరిగించాలి. నీళ్లు మరుగడం మొదలైనప్పుడు మంటను తక్కువ చేయాలి. అప్పుడు అందులో బియ్యాన్ని వేసి గిన్నెపై మూతపెట్టి ఉడికించాలి. ఈ పద్దతిని గనుక ఫాలో అయితే అన్నం మెత్తగా అయ్యే అవకాశమే ఉండదు. 
 

రెస్ట్ ఇవ్వాలి

బాస్మతి రైస్ అయిన తర్వాత దానికి కొద్ది సేపు రెస్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా సారే అన్నం ఉడికిన తర్వాత మంటను ఆపేయాలి. ఆ వెంటనే మూతను తెరకూడదు. అన్నాన్ని తినకూడదు. స్టవ్ ఆపేసిన తర్వాత అన్నాని 5-10 నిమిషాలు మూత పెట్టి అలాగే ఉంచాలి. ఇది చాలా చిన్న చిట్కే అయినా దీనివల్ల ఏ గింజకాగింజ విడిపోతుంది. అన్నం అతుక్కోకుండా ఉంటుంది. ఇది మీరు హోటల్ లో తిన్న అనుభూతిని కలిగిస్తుంది. 

Latest Videos

click me!