Mushroom Cleaning: పుట్టగొడుగులు వండే ముందు ఇలా క్లీన్ చేశాకే వండండి, రంగు మారవు

Published : May 03, 2026, 07:45 AM IST

Mushroom Cleaning: మష్రూమ్స్‌ను కేవలం నీటితో కడిగితే సరిపోదు. అలా చేస్తే అవి నీటిని పీల్చుకుని జిగురుగా మారతాయి. రుచి కూడా పాడవుతుంది. పుట్టగొడుగుల రంగు మారకుండా తెల్లగా శుభ్రం చేయడానికి ఇక్కడ కొన్ని కిచెన్ టిప్స్ ఉన్నాయి.

PREV
14
పుట్టగొడుగుల క్లీనింగ్ టిప్స్

పుట్టగొడుగుల కూర అంటే ఎంతోమంది ఇష్టం. కానీ వాటి శుభ్రం చేయడం మాత్రం చాలా మందికి రాదు. మార్కెట్ నుంచి తెచ్చిన వాటిపై మట్టి, నల్లటి మచ్చలు, ఎరువుల అవశేషాలు ఉంటాయి. కాబట్టి వాటిని కేవలం నీటితో కడిగి వాడేస్తే సరిపోదు. కానీ మష్రూమ్స్ స్పాంజ్‌లా ఉండటం వల్ల నీటిని వెంటనే పీల్చుకుంటాయి. దీనివల్ల అవి జిగురుగా మారిపోతాయి. వీటిని వండినప్పుడు కూర మంచి రుచిని కోల్పోతాయి. మీ మష్రూమ్స్ తెల్లగా, కూర రుచిగా ఉండాలంటే పుట్టగొడుగులను ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోండి.

24
గోధుమ పిండితో

గోధుమపిండితో పుట్టగొడుగులను శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో పుట్టగొడుగులను తీసుకుని వాటిపై కొద్దిగా పొడి గోధుమ పిండిని చల్లాలి. తరువాత చేతులతో మష్రూమ్స్‌ను సున్నితంగా రుద్దండి. ఈ పిండి మష్రూమ్ ఉపరితలానికి అంటుకున్న నల్లటి మురికిని, జిగురును పీల్చుకుంటుంది.  పిండితో పాటు మురికి బయటకు పోతుంది. అప్పుడు మష్రూమ్స్‌ను కొళాయి నీటి కింద పెట్టి వెంటనే కడిగి, పొడి బట్టతో తుడవాలి.

34
తడి బట్టతో శుభ్రపరచడం

కొన్ని మష్రూమ్స్ అంత మురికిగా ఉండవు. వాటిని నీటిలో ముంచడానికి బదులుగా కిచెన్ టవల్ లేదా మస్లిన్ క్లాత్‌ను కొద్దిగా తడి చేసి. ప్రతి మష్రూమ్‌ను తుడిచేస్తే సరిపోతుంది. దీనివల్ల వాటిపై ఉన్న పైపొర మట్టి పోతుంది. మష్రూమ్స్  కూడా నీరు పీల్చుకోకుండా కూర తాజాగా ఉంటుంది.

44
వేడి నీరు, ఉప్పుతో

పుట్టగొడుగలను మరింత శుభ్రంగా క్లీన్ చేయాలనుకుంటే  ఒక పాత్రలో కొద్దిగా గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో కొంచెం ఉప్పు కలపాలి. పుట్టగొడుగులను అందులో వేసి కేవలం 30 సెకన్ల పాటు మాత్రమే ఉంచండి. వెంటనే బయటకు తీసి చల్లటి నీటిలో వేసి వెంటనే తీసేయండి. మెత్తటి వస్త్రంతో తుడిచేయండి. కానీ మష్రూమ్స్‌ను నీటిలో ఎక్కువసేపు వదిలేయొద్దు.

Read more Photos on
click me!

Recommended Stories