cholesterol: ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే రోగాలేంటో తెలుసా..?

Published : May 05, 2022, 04:55 PM IST

cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే.. గుండెపోటు వచ్చే అవకాశం పెరగడమే కాదు.. మరెన్నో ప్రమాదకరమైన రోగాలు చుట్టుకునే అవకాశం పొంచి ఉంది. 

PREV
18
cholesterol: ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే వచ్చే రోగాలేంటో తెలుసా..?

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మరెన్నో అనారోగ్య సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. మొదటిది మంచి కొలెస్ట్రాల్ అయితే రెండోది చెడు కొలెస్ట్రాల్. 

28
cholesterol

అయితే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు రావడానికి అసలు కారణం చెడు ఆహారాలను ఎక్కువగా తీసుకోవడమే. అయితే మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయో.. దానిని నివారించడానికి ఎలాంటి  జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

38
heart attack

గుండెపోటు వచ్చే అవకాశం.. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు మీ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

48
brain stroke

బ్రెయిన్ స్ట్రోక్.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపు తప్పితే అది బ్రెయిన్ స్ట్రోక్ కు దారి తీస్తుంది. వాస్తవానికి ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే మెదడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరగదు. దీనివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. 

58

కంటిచూపు తగ్గుతుంది.. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే కళ్ల దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో మీ కళ్లు మసకబారుతాయి. అంతకాదు కంటి చూపు కూడా తగ్గుతుంది. 
 

68
kidney

మూత్రపిండాల సమస్యలు పెరుగుతాయి.. ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే మీ శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ మీ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

78

కొలెస్ట్రాల్ ను ఇలా నియంత్రించండి.. ఆకుపచ్చ కూరగాయలను, తాజా పండ్లను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండండి. దీంతో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.  
 

88

ఒత్తిడి వల్ల కూడా మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడి తగ్గేందుకు ప్రతిరోజూ యోగాను చేయండి.  
 

click me!

Recommended Stories