Virus: చైనాలో మరో మహమ్మారి.. అచ్చంగా కోవిడ్‌ లాంటిదే. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Published : Feb 22, 2025, 10:08 AM ISTUpdated : Feb 22, 2025, 10:43 AM IST

కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనాలో మరో కొత్త మహమ్మారి వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వైరస్‌ను HKU5-CoV-2గా పరిశోధకులు గుర్తించారు. ఈ కొత్త వైరస్ కోవిడ్‌ 19ని పోలి ఉండడం ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకీ కొత్త వైరస్‌ ఎలా వ్యాపిస్తుంది.? ఈ వైరస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..   

PREV
14
Virus: చైనాలో మరో మహమ్మారి.. అచ్చంగా కోవిడ్‌ లాంటిదే. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించిన ఓ వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది. వేలాది మంది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ భయానక పరిస్థితుల నుంచి క్రమంగా బయటకు వస్తోంది. ఇలాంటి తరుణంలో చైనాలో మరో వైరస్‌ వెలుగులోకి వచ్చిందన్న వార్త అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.  HKU5-CoV-2 వైరస్‌ వెలుగులోకి వచ్చినట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. 
 

24

అచ్చంగా కోవిడ్‌ 19 వైరస్‌ని పోలి ఉండే ఈ వైరస్‌ను పరిశోధకులు గబ్బిలాల్లో గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నట్లు సైంటిస్ట్‌ చెబుతున్నారు. హాంకాంగ్‌లోని శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ వివరాలను పీర్‌ రివ్యూడ్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు. అయితే ఇది కోవిడ్‌ 19 అంత ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతుండడం కాస్త ఉపశమనం కలిగించే వార్తగా చెప్పాలి. 

34

కోవిడ్‌-19కి కారణమైన SARS-CoV2ని పోలి ఉన్నట్లు గుర్తించారు. వైరస్‌పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్‌ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్‌ షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు. ఈ పరిశోధనల్లో గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, వుహాన్‌ యూనివర్సిటీ, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సైంటిస్టులు పాల్గొన్నారు. అయితే ఈ కొత్త వైరస్‌ ప్రస్తుతం గబ్బిలాల్లోనే కనిపించింది. అయితే ఇది మనుషులకు సోకిందా లేదా అన్నదానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. 
 

44

లక్షణాలు ఎలా ఉంటాయి.? 

ఈ వైరస్‌ సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయన్న దానిపై కూడా సైంటిస్ట్ ఇప్పటి వరకు ఎలాంటి అంచనాకు రాలేరు. అయితే సాధారణంగా కరోనా వైరస్‌ సమయంలో వచ్చిన లక్షణాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు, అలసట వంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వైరస్‌ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. 
 

click me!

Recommended Stories